Fat Reduce Home Remedy: ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య ఒకటి..చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చాలా వరకు యోగాతో పాటు వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. మీరు కూడా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకుంటే తప్పకుండా వైద్యులు సూచించిన కొన్ని హోం రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల నడుము చుట్టు కొలెస్ట్రాల్‌తో పాటు బరువును కూడా తగ్గించుకోవచ్చు.
నడుము చుట్టు కొలెస్ట్రాల్ రావడానికి కారణాలు:
❁ కొవ్వు కారణంగా
❁ జన్యుపరమైన కారణాలు
❁ టెన్షన్
❁ ఇతర వ్యాధులు
❁ కండరాల బలహీనత
❁ కూర్చుని పని చేయడం అలవాటు
❁ జీర్ణక్రియ సమస్యలు
❁ హార్మోన్లలో మార్పులు
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి హోమ్ రెమెడీ:
ఈ రెమెడీకి కావాల్సిన పదార్థాలు:
❁ 50 గ్రాముల సోంపు
❁ 50 గ్రాముల అవిసె గింజలు
❁ 25 గ్రాముల జీలకర్ర
❁ పిడికెడు కరివేపాకు
❁ అర టీస్పూన్ రాక్ సాల్ట్
తయారీ విధానం:
పై పదార్థాలను అన్నింటినీ మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో నిల్వ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులోనే పైన తయారు చేసిన రెమెడీని ఆ నీటిలో కలుపుకుని తాగాలి. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తప్పకుండా ఇలా చేయండి:
బెల్లీ ఫ్యాట్‌ను ఆరోగ్యంగా తగ్గించుకోవాలనుకునేవారు ఈ రెమెడీని 21 రోజులు వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిని వినియోగించేవారు తప్పకుండా ప్రతి రోజు వ్యాయామాలతో పాటు డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి