Coconut Benefits: వేసవిలో శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుకోవాలి. ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాలు వేసవిలో ఔషధంలా పనిచేస్తాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవల్సింది కొబ్బరి నీళ్లు. వేసవిలో ప్రధానంగా తలెత్తే డీ హైడ్రేషన్ సమస్యకు సరైన సమాధానం కొబ్బరి నీళ్లే.
వేసవిలో సాధారణంగా బయటి ఉష్ణోగ్రత, వడగాల్పుల కారణంగా డీ హైడ్రేషన్, జీర్ణక్రియ, కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. శరీరం అంతర్గతంగా వేడి చేయడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లు తాగితే ముందు శరీర తాపం తగ్గుతుంది. చలవ చేస్తుంది. కొబ్బరి నీళ్లు తరచూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేవలం శరీరాన్ని కూల్ చేసేందుకే కాకుండా..గుండె రోగాల్ని దూరం చేసేందుకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పోషక పదార్ధాల కారణంగా ప్రతి సీజన్‌లో కూడా ఏ మాత్రం భయం లేకుండా తాగవచ్చు.
వేసవికాలంలో కడుపు చలవ చేయాలంటే కొబ్బరి నీళ్లు లేదా కొబ్బరి కాయ తప్పకుండా తీసుకోవల్సిందే. ఎందుకంటే కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రేవుల్ని పటిష్టంగా ఉంచేందుకు జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు కొబ్బరి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే వేసవిలో కొబ్బరి ఓ దివ్యౌషధంగా పనిచేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
వేసవిలో సాధారణంగా కడుపు మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్య ఎదురైనప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. కొబ్బరి నీళ్లు తాగితే చలవ చేసి కడుపు మంట, ఎసిడిటీ దూరమౌతాయి. కొబ్బరి తిన్నా సరే కడుపుకు చలవ చేస్తుంది. దీనికోసం రోజూ ఉదయం ఎండు కొబ్బరి తింటే ప్రయోజనం.
వేసవిలో ఎండలు, వడగాల్పులతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతుంటారు. వడదెబ్బ తగులుతుంటుంది. డీ హైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది. ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు కొబ్బరిని తగిన మోతాదులో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. వేసవిలో ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు.
Also read: Cheese Benefits: పాల ఉత్పత్తుల్లో చీజ్ ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది, ఎలా తినాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook