Protein Rich Food: మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్స్ లభించే 4 శాకాహార పదార్ధాలు

Protein Rich Food: మనిషి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రోటీన్ల పాత్ర చాలా కీలకం. శరీరంలోని అన్ని అంగాలు, కణజాలం, నాళికల నిర్మాణంలో ప్రోటీన్లు చాలా అవసరమౌతాయి. మరి ఈ ప్రోటీన్ల కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో చాలామందికి సందేహాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 6, 2023, 06:53 PM IST
Protein Rich Food: మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్స్ లభించే 4 శాకాహార పదార్ధాలు

Protein Rich Food: మనిషి శరీర నిర్మాణంలో ప్రోటీన్ల పాత్ర అత్యంత కీలకమైంది. శరీరంలో చోటుచేసుకునే వివిధ రకాల రసాయనిక ప్రక్రియల్లో ప్రోటీన్ల అవసరం ఉంటుంది. ప్రోటీన్లు అంటే సాధారణంగా మాంసాహారంలోనే ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ కొన్ని శాకాహార పదార్ధాల్లో కూడా శరీరానికి కావల్సిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. 

శాకాహార ప్రియలు..మాంసాహారం తీసుకోనివారికి ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రోటీన్లు మాంసం, చేపలు, గుడ్లు, పాలలోనే ఉంటాయని భావిస్తుంటారు. కొన్ని రకాల శాకాహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా శరీరానికి కావల్సిన ప్రోటీన్లను పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

బీన్స్ జాతి కూరల్లో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ప్రోటీన్లతో పాటు ఫైబర్, ఐరన్, ఇతర పోషకాలు అత్యధికంగా ఉండటం వల్ల శరీరానికి చాలా మేలు చేకూరుతుంది. సాధారణంగా బీన్స్‌ను కూరలుగా వండుకుని తింటారు. బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 

సోయా బీన్, సోయా ఉత్పత్తుల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ప్రోటీన్లు పెద్దమొత్తంలో లభించే శాకాహార పదార్ధాల్లో అద్భుతమైందిగా భావించవచ్చు. సోయాబీన్‌తో చేసిన చాలా రకాల పదార్ధాలు టోఫూ, సోయా మిల్క్, సోయా బీన్స్,, సోయా ప్రోటీన్ పౌడర్ వంటివి తీసుకోవచ్చు. 

ఇక మరో ముఖ్యమైన పదార్ధం నట్స్, సీడ్స్. ఇందులో కావల్సినన్ని ప్రోటీన్లు దొరుకుతాయి. రోజూ సాయంత్రం వేళల్లో స్నాక్స్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. సలాడ్, స్మూదీ రూపంలో కూడా తీసుకోవచ్చు. రోజూ తగిన పరిమాణంలో నట్స్ ,సీడ్స్ తీసుకుంటే ఎలాంటి ప్రోటీన్ లోపం తలెత్తదు. 

ఇక ప్రోటీన్లు సమృద్ధిగా లభించే మరో శాకాహారం బీన్స్, పప్పులు. అసలు రోజువారీ డైట్‌లో ఇవి ఉంటే ఇక మాంసాహారం అవసరమే ఉండదు. అంతెక్కువ పరిమాణంలో ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్లతో పాటు ఐరన్, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి.

Also read: Hypertension Diet: 2 రోజుల్లోనే బీపీ కంట్రోల్‌ చేసే ఆహారాలు ఇవే..తప్ప ట్రై చేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News