Dehydration: వేసవిలో మీ బాడీ డీహైడ్రేట్ అవుతోందా, ఈ చిట్కాలతో అద్భుత ఫలితాలు

Dehydration: నీరు శరీరానికి చాలా చాలా అవసరం. నీరు లేకపోతే శరీరం పనితీరు సక్రమంగా ఉండదు. ముఖ్యంగా వేసవిలో తగినంత నీరు తీసుకోకపోతే శరీరం డీహ్రైడ్రేషన్‌కు గురవుతుంటుంది. ఈ క్రమంలో తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 30, 2023, 04:36 PM IST
Dehydration: వేసవిలో మీ బాడీ డీహైడ్రేట్ అవుతోందా, ఈ చిట్కాలతో అద్భుత ఫలితాలు

Dehydration: మనిషి రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే మనిషి శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేసేందుకు నీళ్లు దోహదపడతాయి. నీళ్లు తగిన మోతాదులో లేకుంటే డీహ్రైడ్రేషన్ అయి..వివిధ సమస్యలకు దారితీస్తుంది. డీ హైడ్రేషన్ కారణంగా అలసట, వీక్నెస్, తల తిరగడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఈ పరిస్థితుల్లో సులభమైన హోమ్ రెమిడీస్ మంచి ఫలితాలనిస్తాయి. డీహైడ్రేషన్ సమస్యను దూరం చేసేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..

డీహైడ్రేషన్ దూరం చేసేందుకు చిట్కాలు

మజ్జిగ

మనిషి శరీరంలో నీటి కొరత ఏర్పడితే తక్షణం మజ్జిగ తాగాల్సి ఉంటుంది. ఎందుకంటే మజ్జిగ అనేది ప్రో బయోటిక్. ఫలితంగా శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో నీటి కొరత కూడా దూరమౌతుంది. ఈ క్రమంలో డీ హ్రైడ్రేషన్ సమస్య దూరం చేయాలంటే..రోజుకు కనీసం 3 సార్లు మజ్జిగ తాగాలి. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పౌడర్ కలుపుకుని తాగితే ఇంకా మంచిది.

జొన్న నీరు

మీ శరీరంలో నీటి కొరత ఉంటే..జొన్న నీరు చాలా ప్రయోజనకరం. జొన్న నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. జొన్న నీళ్లు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఓ గ్లాసు నీళ్లలో కొద్దిగా జొన్నలు వేసి బాగా ఉడికించాలి. ఆ తరువాత వడకాచి కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి. రోజుకు 4 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి.

నిమ్మరసం

శరీరంలో నీటి కొరత ఏర్పడితే నిమ్మరసం మంచి ప్రత్యామ్నాయం. నిమ్మరసంలో కొద్దిగా పుదీనా, తేనె కలుపుకుంటే ఇంకా మంచిది. రోజుకు కనీసం 3 సార్లు తాగాలంటారు వైద్యులు. ప్రతిరోజూ నిమ్మరసం తాగుతుంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.

Also read: White Hair To Turn Black: ఈ నూనెతో తెల్ల జుట్టు కేవలం 4 రోజుల్లో నల్లగా మారడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News