/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Skin Care Tips: సీజన్ ఏదైనా సరే చర్మాన్ని సంరక్షించుకోవడం తప్పదు. చర్మం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చర్మ నిపుణులు చెబుతున్నారు. చర్మ సంరక్షణకు ఏం చేయాలి, ఏం చేయకూడదో చూద్దాం.

ఎండాకాలమనే కాదు..చలికాలంలో కూడా చర్మాన్ని సంరక్షించుకోవల్సిన అవసరం ఉంటుంది. వేసవిలో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎండల తీవ్రత దృష్ట్యా అదనపు జాగ్రత్తలు అవసరమౌతాయి. చర్మాన్ని సంరక్షించుకోవడమనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. అందుకే చర్మం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చర్మ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఎండల తీవ్రత నుంచి మీ చర్మాన్ని కాపాడుకోవల్సిన అవసరముంది. ఎందుకంటే సూర్యుని నుంచి నేరుగా వచ్చే అతి నీలలోహిత కిరణాలు కల్గించే హాని నుంచి చర్మాన్ని రక్షించుకోవాలి. అందుకే వేసవి వచ్చిందంటే చాలా సన్‌స్క్రీన్ లోషన్స్ ఎక్కువగా వాడుకలో వస్తుంటాయి. సన్‌స్క్రీన్ లోషన్స్ ద్వారా స్కిన్‌కేర్ తప్పనిసరి. ఇక వేసవిలో చాలామందికి చెమట కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు క్లెన్సర్ వాడటం మంచిది. అయితే రసాయనాలు లేని క్లెన్సర్ వాడటం మంచిది.

ఇక వేసవి వేడిలో ముఖానికి నూనె లేదా సీరమ్ ఉపయోగించడం ఎంతమాత్రం మంచిది కాదు. వేసవి కారణంగా చెమట, జిడ్డు ఎక్కువగా ఉంటుంది. నూనె వంటివి రాస్తే..చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. 

చర్మం ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంచాలి

మరీ ముఖ్యంగా వేసవి కాలంలో సాధ్యమైనంత వరకూ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి. చర్మానికి తగిన తేమ లేకపోతే..అనారోగ్యం కారణంగా చర్మ సమస్యలు వెంటాడుతాయి. బ్లాక్‌హెడ్స్, డ్రై స్కిన్ వంటివి సమస్యలెదురవుతాయి. చర్మం తేమగా ఉండేందుకు వీలుగా మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించాలి. మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం సంరక్షణ కోసం మాయిశ్చరైజర్ వాడాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు వీలుగా వేసవిలో ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. 

ఎండలో వెళ్లేటప్పుడు ముఖంపై అలసట, చికాకు లేకుండా ఉండాలంటే టోనర్ తప్పకుండా వాడమంటున్నారు. టోనర్ అనేది చర్మంలో పీహెచ్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఎండలోంచి వచ్చిన వెంటనే..చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవడమనేది ఓ అలవాటుగా చేసుకోవాలి.

Also read: Ajwain Water: శరీరంలో అన్ని రుగ్మతలకు కారణం జీవక్రియలో సమస్యే..ఆ నీళ్లే దీనికి పరిష్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Healthy and skin care tips, how to protect the skin in any season with simple steps
News Source: 
Home Title: 

Skin Care Tips: చర్మ సంరక్షణకు సీజన్‌తో సంబంధముందా, ఏం చేయాలి

Skin Care Tips: చర్మ సంరక్షణకు సీజన్‌తో సంబంధముందా, ఏం చేయాలి
Caption: 
Skin Care Tips ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Skin Care Tips: చర్మ సంరక్షణకు సీజన్‌తో సంబంధముందా, ఏం చేయాలి
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Friday, June 24, 2022 - 22:59
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
45
Is Breaking News: 
No