How To Increase Platelet Count: ప్లేట్‌లెట్స్ పెంచే మ్యాజిక్ జ్యూస్ ఇదే.. ఇలా తాగితే 3 రోజుల్లో లక్ష ప్లేట్‌లెట్స్ పెరగడం ఖాయం

Increase Platelet Count Naturally: డెంగ్యూ కారణంగా ప్లేట్‌లెట్స్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు బొప్పాయి పండు రసాన్ని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 7, 2023, 06:04 PM IST
How To Increase Platelet Count: ప్లేట్‌లెట్స్ పెంచే మ్యాజిక్ జ్యూస్ ఇదే.. ఇలా తాగితే  3 రోజుల్లో లక్ష ప్లేట్‌లెట్స్ పెరగడం ఖాయం

Increase Platelet Count Naturally: భారతదేశవ్యాప్తంగా వర్షాలు క్రమంగా కురుస్తున్నాయి.. మరికొన్నిచోట్ల భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే దీని కారణంగా వాతావరణం లోని తేమ పరిమాణాలు కూడా ఒక్కసారిగా పెరిగిపోతాయి. ప్రేమ పెరగడం కారణంగా ఇన్ఫెక్షన్ల ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో శరీరంపై శ్రద్ధ వహించలేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లపై పేరుకుపోయిన మురికి నీరు కారణంగా డెంగ్యూ దోమలు పెరిగి.. చాలా మంది డెంగ్యూ జ్వరం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. లేకపోతే రక్తంలోని ప్లేట్లెట్స్ పై ప్రభావం పడి, అవి తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే ప్లేట్లెట్ లోపం సమస్యలతో బాధపడుతున్న వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాలి.

డెంగ్యూ దోమలు వ్యాపించడానికి కారణాలు ఏంటో తెలుసా?:
డెంగ్యూ అనేది ఈడిస్ ఈజిప్టి దోమ కాటు వల్ల శరీరానికి సోకే అంటు వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన చాలామందిలో డీహైడ్రేషన్ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ దోమను 'టైగర్ దోమ' అని కూడా అంటారు. ఇది అచ్చం టైగర్ చారలను పోలి ఉంటుంది. ఇది మొదటగా మురుగునీటిలో లార్వాల అభివృద్ధి చెంది, దోమలా తయారవుతుంది.

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  

డెంగ్యూ దోమ కుట్టడం వల్ల హానికరమైన వైరస్ శరీరంలోకి వ్యాపిస్తుంది. దీంతో ఒక రోజు తర్వాత మనిషి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత 30 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా మీ బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి డెంగ్యూ బారిన పడకుండా ఉండడానికి వాన కాలంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం చాలామందిలో డెంగ్యూ జ్వరం రావడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతుంది. వ్యక్తికి మైక్రోలీటర్ రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ 1,50,000 నుంచి 2,50,000 మధ్య ఉంటుంది. డెంగ్యూ జ్వరం కారణంగా లక్ష ప్లేట్‌లెట్స్ పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ జ్యూస్‌తో ప్లేట్‌లెట్స్ బూస్ట్ అవ్వడం ఖాయం:
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వారిలో ప్లేట్‌లెట్స్ లోపం సమస్యలు వస్తే అజాగ్రత్త వహించకుండా తప్పకుండా బొప్పాయి ఆకులతో తయారుచేసిన రసాన్ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు ప్లేట్‌లెట్స్ పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News