శవం యొక్క తలను మర్చి వైద్యరంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు ఒక ఇటలీ వైద్యుడు. అతని పేరు సెర్గియా కానావేరో. ఇటలీకి చెందిన ఈ శస్త్రచికిత్స నిపుణుడు తన వైద్య బృందంతో కలిసి ఈ విజయాన్ని సాధించాడు. తల మార్పిడికి సెర్గియా, అతని బృందం సుమారు 18 గంటలు కష్టపడ్డారు. సెర్గియా మాట్లాడుతూ- " మేము విజయవంతంగా శస్త్రచికిత్స ను పూర్తి చేశాం. సొంత టెక్నీక్ ను ఉపయోగించి తలకు వెన్నెముక, రక్త నాళాలు, నరాలు అనుసంధానం చేసాము" అని అన్నారు. ఈ చికిత్సతో జీవించి ఉన్న మనుషుల తలల్ని కూడా మార్చే సమయం ఆసన్నమైదని అని ఆయన పేర్కొన్నాడు. అయితే చికిత్సకు సంబంధించిన ఆధారాలేవీ ఆయన ప్రకటించలేదు. త్వరలోనే అందుకు సంబంధించిన పత్రాలు విడుదల చేస్తామని వెల్లడించారు.