Mango: పండ్ల రారాజు.. పోషకాలకు పుట్టినిల్లు మామిడి పండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Mangoes Health benefits: ఎండాకాలం రాబోతుంది ఇక మామిడి పండ్ల సమయం కూడా మొదలవుతుంది. మామిడిపండు తీసుకోవడం వల్ల మనం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా.. దీంతో జ్యూస్, సలాడ్ లేదా నేరుగా కూడా తింటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడిపండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం

Written by - Renuka Godugu | Last Updated : Feb 10, 2025, 11:55 AM IST
Mango: పండ్ల రారాజు.. పోషకాలకు పుట్టినిల్లు మామిడి పండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Mangoes Health benefits: మామిడి పండ్లు కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాదు.. మామిడి పండ్లను తీసుకోవటం వల్ల మన చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది.. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు ప్రేరేపిస్తుంది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కణాల పునరుజ్జీవనానికి తోడ్పడుతుంది. సెబం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మంచి పోషణ కూడా అందిస్తుంది. విటమిన్ సి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది చర్మం, జుట్టుకు ఎంతో అవసరం.. అంతే కాదు వృద్ధాప్య ఛాయలు త్వరగా ముఖంపై కనిపించకుండా కాపాడుతుంది. మామిడి పండులో ఉండే విటమిన్ ఇ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.

ఖనిజాల పుష్కలంగా ఉండే మామిడిపండు తీసుకోవడం వల్ల మన శరీరానికి విటమిన్స్, మినరల్స్ అందుతాయి. అంతే కాదు ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది..మామిడిపండు తరచు తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

మామిడి పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఫినోలిక్ కాంపౌండ్స్ కూడా ఉండటం వల్ల ఇది ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. సెల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. దీంతో ప్రాణాంతక క్యాన్సర్, గుండె సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. మీ రెగ్యులర్ డైట్ లో మామిడిపండు ఉండటం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. శరీరానికి తక్షణ శక్తి అందించడంతో పాటు ఆక్సిడేటివ్స్ నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది.

ఇదీ చదవండి:  జంక్ ఫుడ్ బదులు.. గుప్పెడు సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే మీ గుండె గట్టిదవుతుంది..

మామిడిపండు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కార్డియో ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్‌ మన శరీరంలో పెరుగుతాయి. మామిడి పండులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల ఇవి కడుపు నిండిన అనుభూతిని కూడా ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. మామిడిపండు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారికి కూడా మంచిది. ఇక బ్లడ్ ప్రెషర్ స్థాయిలను కూడా అదుపులో ఉంచే గుణాలు ఇందులో ఉన్నాయి.

ఇదీ చదవండి: నల్ల మిరియాలు ఇలా తిన్నారంటే వారంలో బరువు తగ్గిపోతారు.. నమ్మలేని ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా..

మామిడిపండు తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి  మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యకు మంచికి నివారిణి.. కడుపు సమస్యలను మంచి ఉపశమనం కల్పిస్తుంది.  వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కూడా మనకు అందుతాయి.  అయితే ఏదైనా అతిగా తినడం మంచిది కాదు. వీటిని రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవచ్చు కానీ, మోతాదుకు మించి తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం తీసుకుని తినాలి. షుగర్‌ వ్యాధిగ్రస్థులు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేలా చేస్తాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News