Nutmeg Powder Health Benefits: జాజికాయ ఇది మన వంటింట్లో అందుబాటులో ఉంటుంది. వేల ఏళ్లుగా ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేద పరంగా మంచి ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే నేషనల్ లైబ్రరీ మెడిసిన్ ప్రకారం జాజికాయలో యాంటీబయాటిక్, యాంటీ ధర్మబోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కార్మినేటివ్ గుణాలు మెడిసినల్ లో ఉపయోగిస్తారు అంతేకాదు జాజికాయలో పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం , కాపర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఖనిజాల పుష్కలంగా ఉండే ఈ జాజికాయ నీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక చిటికెడు ఈ జాజికాయ పొడి తో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసుకుందాం.
జాజికాయతో లాభాలు..
జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. జాజికాయని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఖనిజాలు మంచి జీర్ణ క్రియలు ప్రోత్సహిస్తాయి దీంతో కడుపు సంబంధించిన గ్యాస్ కి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
నిద్రలేమి..
నిద్రలేమి వ్యాధులతో చాలామంది బాధపడుతుంటారు. బిజీ లైఫ్ వల్ల ఇలా జరుగుతుంది. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా నిద్రలేమి వస్తుంది దీనివల్ల ఇన్సోమియా వంటి ఇతర వ్యాధులు కూడా వస్తాయి. అయితే జాజికాయను తీసుకోవటం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది.
పంటి నొప్పి..
పంటి నొప్పితో బాధపడితే వారికి కూడా జాజికాయ ఎఫెక్టివ్ రెమిడిగా పని చేస్తుంది. అంతేకాదు నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది ఇందులో బయో యాక్టివ్ యుగనైల్ ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది పంటి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
స్కిన్ కేర్..
జాజికాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రో బ్యాక్టీరియాల్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది స్కిన్ పై వచ్చే దురదను మంటను తగ్గిస్తుంది. జాజికాయ యాక్నే నిర్మూలించడానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో పుష్కలంగా ఉంటాయి దీంతో ముఖంపై మచ్చలు గీతాలు రాకుండా నివారిస్తుంది.
జాజికాయలు ఉండే యాంటీ ఇన్ల్పమేటరీ గుణాల వల్ల మనకు ర్యూమటిజం వంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. జాజికాయ బ్రెయిన్ హెల్త్ కూడా తోడ్పడుతుంది ఇందులో పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఉండటం వల్ల అభిజ్ఞ పనితీరును మెరుగు చేస్తుంది.
ఇదీ చదవండి: తల్లి డ్యాన్సర్.. తండ్రి స్టార్ క్రికెటర్.. ఆసక్తికరమైన సనా గంగూలీ ఎంచుకున్న కెరీర్ ఏంటో తెలుసా?
గుండె ఆరోగ్యం..
జాజికాయలో క్యాల్షియం పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఇతర సమస్యలు రాకుండా నివారిస్తుంది.
డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి కూడా జాజికాయ ఎఫెక్టివ్ రెమెడి అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటితో తయారు చేసిన నీటిని తీసుకోవడం వల్ల స్ట్రెస్ నుంచి బయటపడతారు.ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడే వారికి కూడా జాజికాయ ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది ఇందులో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే సూపర్ టెక్నిక్ ఉంది జాజికాయను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్ సదుపులో ఉంటాయి(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: మీ ఇంట్లో నివసించే ఈ చిన్న జీవి పాము కంటే ప్రమాదకరం! ఏటా 10 లక్షల మందిని చంపేస్తుంది!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook