Papaya Juice Benefits: బొప్పాయి పండును క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇందులో బాడీకి అవసరమైన విటమిన్ సితో పాటు విటమిన్ A అధికంగా మోతాదులో లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు, కంటి చూపును మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఈ పండులో ఫోలిక్ యాసిడ్, పొటాషియం, పాపైన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా లభిస్తుంది. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో తెలుసుకోండి.
బొప్పాయి పండు రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌లను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి బొప్పాయి రసం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
హృదయ ఆరోగ్యానికి మేలు:
బొప్పాయిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
క్యాన్సర్ వంటి సమస్యలకు చెక్:
బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేసి, క్యాన్సర్ కణాల ఏర్పాటును నిరోధిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు అనేక క్యాన్సర్లను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
చర్మం ఆరోగ్యానికి:
బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను తగ్గించడానికి బొప్పాయి రసం సహాయపడుతుంది. దీంతో పాటు స్కిన్ గ్లో పెంచేందుకు కూడా సహాయపడుతుంది.
కళ్ల ఆరోగ్యానికి:
బొప్పాయిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి, కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తరచుగా కంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ రసం తాగాల్సి ఉంటుంది.
శరీర బరువు తగ్గడానికి:
బొప్పాయిలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరాన్ని దీర్ఘకాలం పాటు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ రసం తాగాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.