Tea Unknown Side Effects In Telugu: టీ అతిగా తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అదే ఈ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది ఉదయాన్నే టీ కప్పులు కప్పులు తాగుతూ ఉంటారు. నిజానికి ఇలా తాగడం మంచిదేనా? రోజు ఇలా తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు అతిగా టీ తాగడం వల్ల కూడా మరింత తీవ్ర తరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఇతర సమస్యలకు కూడా దారి తీస్తాయి. ఇవే కాకుండా ప్రతి రోజు టీ తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
టీ తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు:
నిద్రలేమి:
టీలో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది నిద్ర వచ్చే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. రాత్రి వేళ టీ తాగడం వల్ల నిద్ర లేమి, నిద్రలో ఆందోళన, నిద్రలో కలలు కనడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె స్పందన రేటు:
కెఫిన్ కలిగిన టీని రోజు ఎక్కువసార్లు తాగడం వల్ల గుండె స్పందన రేటు కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా రక్తపోటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కొంతమందిలో ఆందోళన వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఎక్కువగా టీ తాగడం మానుకుంటే ఎంతో మంచిది.
గుండె నరాలు సంకోచితం:
కొన్ని కొన్ని సార్లు కెఫిన్ ఎక్కువగా ఉండే టీని రోజులో మూడు నుంచి నాలుగు సార్లు తాగడం వల్ల గుండె నరాలు సంకోచితమై అనేక సమస్యలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా కొంతమందిలో రక్తపోటు సమస్య వచ్చి త్వరలోనే గుండె జబ్బులు కూడా ప్రారంభం అవ్వచ్చు. అలాగే గుండె దడ ఇతర గుండెకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చు.
జీర్ణ సమస్య:
ఎక్కువగా జీర్ణ సమస్యలు రావడానికి ప్రధాన కారణం అధిక మోతాదులో టీ తాగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ ఎక్కువ తాగితే గుండెను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా అజీర్ణం ఏసీడీటీ మంట మలబద్ధకం వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కొంతమందిలో పొట్ట ఉబ్బరం కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఐరన్ లోపం:
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఎక్కువ మోతాదులో కెఫిన్ ఉన్న టీని తాగడం వల్ల ఐరన్ లోపం వంటి సమస్యలు కూడా వస్తాయి. దీనివల్ల రక్తహీనత వంటి సమస్యలకు కూడా దారి తీసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఐరన్ లోపంతో బాధపడుతున్న మహిళలు చిన్నపిల్లలు ఎక్కువసార్లు టీ తాగుకుండా ఉండడం మంచిది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
ఎముకల ఆరోగ్యం:
టీ లో ఉండే కెఫిన్ ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల ఎముకల బలహీనత సమస్యలు వచ్చి సులభంగా విరిగిపోవడం ఇతర సమస్యలు కూడా వస్తాయి. అలాగే మరికొంతమందిలోనైతే ఎముకలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చు.
కిడ్నీ సమస్య:
చాలామందిలో కిడ్నీ సమస్యలు టీలో ఉండే ఆక్సలిన్ వల్లే వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కిడ్నీలపై ప్రభావం చూపి రాళ్లు ఇతర వంటి సమస్యలకు దారితీస్తుంది. దీంతో పాటు కిడ్నీలు పాడైపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.