Weight Loss Drinks In Monsoon Season: అధిక బరువు తగ్గించేందుకునేందుకు సైతం ఈ వేర్వేరు రకాల హెర్బల్ ఛాయలు ఉపయోగపడతాయి. ఇంతకీ ఆ హెర్బల్ ఛాయలు ఏంటో తెలుసుకోవాలంటే ఇదిగో ఇక్కడ ఓ లుక్కేయండి.
మిరియాల ఛాయ : వర్షం పడుతుండగా వేడి వేడి మిరియాల ఛాయ తాగితే వర్షా కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.
కవా ఛాయ్ : కవా ఛాయలో దాల్చన చెక్క, యాలకులు, లైట్‌గా చక్కర లేదా బెల్లం వేసి చేసిన తేనీరు. ఈ కవా చాయతో గొంతులో ఇన్ ఫెక్షన్స్ కి చెక్ పెట్టడంతో పాటు అధిక బరువు తగ్గించేందుకు దోహదపడుతుందట.
అల్లం ఛాయ : అల్లం ఛాయ అంటే ఇష్టపడని వారు ఉంటారా చెప్పండి ? మిగతా అన్ని రకాల ఛాయలు కొంత ఘాటుగా ఉండటం వల్ల అంతగా ఇష్టపడకపోవచ్చునేమో కానీ అల్లం ఛాయ నోటికి కూడా రుచి ఇచ్చేది కావడంతో చాలా మంది అల్లం ఛాయ్ తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇది సేవించడం వల్ల వర్షాకాలంలో వ్యాపించే ఇన్‌ఫెక్షన్స్‌ని దూరం పెట్టొచ్చు.
గ్రీన్ టీ : గ్రీన్ టీ రుచి కొంత కషాయంలా ఉండటం వల్ల నోటికి అంతగా రుచించకపోవచ్చునేమో కానీ ఆరోగ్యానికి మాత్రం అద్భుతమైన మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడే వారిలో చాలామంది వెయిట్ లాస్ ట్రీట్మెంట్‌లో భాగంగా ఈ గ్రీన్ టీ సేవిస్తుంటారు.
తులసీ ఛాయ : తులసీ ఆకుల్లో ఉండే సద్గుణాలు మరెందులోనూ ఉండవు అంటుంటారు. ఆరోగ్యానికి ఎన్నో విధాల మేలు చేసే గుణం ఈ తులసి సొంతం. అందుకే తులసీ ఆకులతో చేసిన ఛాయ తాగితే వర్షా కాలంలో తలెత్తే గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, రొంప వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇది మన పెరట్లోనే లభించే దివ్యమైన ఔషదం.
ఇది కూడా చదవండి : Vitamin C foods: రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లు, కూరగాయలు
ఛామంతి ఛాయ : ఒక రకమైన చిన్న ఛామంతి పూలను పూర్తిగా ఎండబెట్టి సేకరించిన పొడితో చేసే ఛాయ ఇది. ఈ చాయ్ ఆరోగ్యానికి ఎన్నో విధాల మేలు చేస్తుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఊలంగ్ టీ : ఊలంగ్ టీ అనేది చైనాకు చెందిన సంప్రదాయమైన తేనీటి ఫ్లేవర్. ఊలంగ్ టీ చైనాకు చెందినదే అయినప్పటికీ.. దీనికి ఉన్న ఔషద గుణాల కారణంగా ఇది విశ్వవ్యాప్తమైంది. వర్షాకాలంలో ఒక రకమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనేది చాలామంది బలమైన నమ్మకం.
ఇది కూడా చదవండి : Badam Health Benefits: బాదాం హెల్త్ బెనిఫిట్స్.. జుట్టు నుంచి రక్త కణాల వరకు ఎన్నో లాభాలు