ఇటీవలి కాలంలో చాలామందికి అధిక బరువు ఓ పెను సమస్యగా బాధిస్తోంది. బరువు తగ్గించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిన ఫలితం కన్పించడం లేదు. ఎందుకంటే కేవలం వ్యాయామం చేయడం లేదా డైట్ తగ్గించడం చేస్తే బరువు తగ్గడం అసాధ్యం. వ్యాయామం చేస్తూనే పోషక పదార్ధాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తీసుకునే ఆహార పదార్ధాలు మీ శరీర బరువుపై ప్రభావం చూపిస్తాయి.ఈ నేపధ్యంలో కొన్ని రకాల జ్యూస్‌లు తాగితే కేవలం 15 రోజుల్లో బరువు తగ్గించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. బరువు తగ్గించుకునేందుకు ఏ జ్యూస్ తీసుకోవాలో తెలుసుకుందాం..
క్యారట్ జ్యూస్
క్యారట్ జ్యూస్ శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, విటమిన్ సి కారణంగా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కంటి చూపు పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పటిష్టమౌతుంది. రోజూ క్రమం తప్పకుండా క్యారట్ జ్యూస్ తాగడం వల్ల బరువు అద్భుతంగా తగ్గించుకోవచ్చు.
కాలిఫ్లవర్ జ్యూస్
కాలిఫ్లవర్ జ్యూస్ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాలిఫ్లవర్ జ్యూస్ తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి. కడుపు ఉబ్బరంగా ఉండటం తగ్గుతుంది. అంతేకాకుండా బరువు తగ్గుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి..అజీర్తి సమస్య దూరమౌతుంది. ఈ జ్యూస్ వల్ల కడుపు ఎక్కువసేపు నిండినట్టుగా ఉంటుంది.
బీట్రూట్ జ్యూస్
బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనకరం. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ గణనీయంగా పెరుగుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే బరువు వేగంగా తగ్గించుకోవచ్చు.
Also read: Kidney Disease: కిడ్నీలో సమస్య ఉంటే ఈ లక్షణాలు కన్పించడం ఖాయం, తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook