Telangana Assembly Elections 2023: తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. కొన్ని పార్టీ నేతలు సీట్లు దక్కలేదని మనస్తాపానికి గురై.. పార్టీలను వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. రేపు తన సతీమణి డా.ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషరెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సోమశేఖర్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కోసం, రేవంత్ రెడ్డి కోసం నిరంతరం పాటు పడితే తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేత మోసపోయిన బాధితులను ఏకం చేసి కొడంగల్ లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు తెలిపారు.
కాప్రా ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, రెండు పూటలా భోజనం పెట్టి సేవ చేశానన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని రకాల సర్వేల్లో సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలుస్తాడని తేలినా రేవంత్ రెడ్డి మాత్రం ఓడిపోయే మూడో స్థానంలో ఉన్న పరమేశ్వర రెడ్డికి టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకే పరమేశ్వర రెడ్డికి టికెట్ ఇచ్చారని అన్నారు. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తనకు మోసం చేసిందని, రేవంత్ రెడ్డి వాడుకుని అహంకారంతో తన గొంతును తడి బట్టతో కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్ ప్రజలు తిరస్కరిస్తే మల్కాజిగిరి నుండి ఎంపీగా గెలిపించి సొంత తమ్ముడిగా సొంత డబ్బులు ఖర్చు చేసి ఎంతో చేస్తే రేవంత్ రెడ్డి వాడుకుని వదిలేశాడని తెలిపారు. త్వరలోనే రేవంత్ బాధిత సంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేపు ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రజాకార్ల రాజ్యం వస్తుందని తెలంగాణను అమ్మే స్తాడని సోమశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు
నేను మోస పోయినట్టు ఇంకెవరూ మోసపోవద్దని రేవంత్ రెడ్డి వద్ద మోసపోయిన అందరూ తనతో కలిసి రావాలన్నారు. కొడంగల్ లో రేవంత్ మోసాలను ప్రజలకు తెలియజేసి రేవంత్ రెడ్డిని ఓడిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వదిలి రేపు తన సతీమణి ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డి తో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తెలిపారు.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేసినా.. బీఆర్‌ఎస్ ఓటమి ఖాయం: రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..