GST Council Meeting: ముగిసిన GST కౌన్సిల్ సమావేశం.. తగ్గనున్న ఈ వస్తువుల ధరలు..

Nirmala Sitharaman: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పలు వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 09:59 AM IST
GST Council Meeting: ముగిసిన GST కౌన్సిల్ సమావేశం.. తగ్గనున్న ఈ వస్తువుల ధరలు..

49th GST Council Meeting Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం సాయంత్రం ముగిసింది. సీతారామన్‌తో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

దిగిరానున్న వీటి ధరలు..
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద పెండింగ్ లో ఉన్న బకాయిలు రూ.16,982 కోట్లను త్వరలోనే చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆలస్యంగా వార్షిక రిటర్న్‌ను దాఖలు చేసేవారి రుసుమును హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. ద్రవ బెల్లం (రాబ్), పెన్సిల్ షార్పనర్ మరియు ట్రాకింగ్ పరికరాలపై జీఎస్టీ తగ్గించాలని నిర్ణయించారు. దీంతో ఈ మూడు వస్తువులు చౌకగా లభించనున్నాయి. 

పాన్ మసాలా, గుట్కా పరిశ్రమలో పన్ను ఎగవేతలను అరికడతామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందుకోసం ఒడిశా ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) నివేదికను ఆమోదించారు. లిక్విడ్ బెల్లం ప్యాకింగ్‌కు ముందు జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని సమావేశంలో నిర్ణయించారు. పెన్సిల్ షార్పనర్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ట్యాగ్-ట్రాకింగ్ పరికరం లేదా డేటా లాగర్ వంటి పరికరం ఇప్పటికే కంటైనర్‌కు అతికించబడి ఉంటే.. ఆ పరికరంపై ఎటువంటి IGST విధించబడదని కౌన్సిల్ నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తర్వాత రూ. 20 కోట్ల టర్నోవర్ ఉన్న స్మాల్ ట్యాక్స్ పేయర్లు వార్షిక జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేయడం ఆలస్యం అయితే అప్పుడు అప్పుడు ఆలస్య రుసుమును హేతుబద్దీకరించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని ఆర్థిక మంత్రి తెలిపారు.

Also Read: Train Ticket Rules: ఒకరి టికెట్ మరొకరికి బదిలీ చేయవచ్చా, రైల్వే నియమాలు ఏం చెబుతున్నాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News