7th Pay Commission DA Hike News: కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ ఏడాది రెండో డియర్నెస్ అలవెన్స్ పెంపుపై ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి డీఏ నాలుగు శాతం పెరగ్గా.. రెండో డీఏ కూడా 4 శాతం పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 3 శాతమే పెరుగుతుందని కొందరు అంటుండగా.. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వస్తుందని ప్రచాం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి ప్రకటన ఎప్పుడు విడుదలైనా జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దసరా, దీపావళి గిఫ్ట్‌గా కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు ప్రకటన చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డీఏను 4 శాతం పెరిగిగే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం 42 శాతం అందుతుండగా.. నాలుగు శాతం పెరిగితే 46 శాతానికి చేరుకుంటుంది.
డీఏను కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం కారణంగా నెలవారీ జీతం, పెన్షన్ సంపద తగ్గుతున్న కొనుగోలు శక్తిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి DA/DR రేటును సవరిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా డీఏను బేసిక్ శాలరీలో శాతంగా లెక్కిస్తారు. డియర్నెస్ అలవెన్స్ శాతం = ((AICPI సగటు (ఆధార సంవత్సరం 2001=100) గత 12 నెలలు–115.76)/ 115.76)*100 ఈ ఫార్మాలా ప్రకారం డీఏను లెక్కిస్తారు.
ప్రస్తుతం బేసిక్ శాలరీ రూ.18 వేలు ఉన్న ఉద్యోగులకు.. డీఏ 42 శాతం నెలవారీ రూ.7,560 అందుతోంది. కొత్త డీఏ నాలుగు శాతం పెంపును అంచనా వేస్తే.. అంటే 46 శాతానికి లెక్క వేస్తే.. నెలవారీ పెరుగుదల రూ.8,280కి చేరుకుంటుంది. రూ.18 వేలు బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులు వార్షిక జీతం రూ.8,640 పెరిగే అవకాశం ఉంది. అత్యధికంగా రూ.56,900 బేసిక్ శాలరీ ఉన్న ఇతర ఉద్యోగులకు.. ప్రస్తుతం రూ.23,898 డీఏ అందుతోంది. 46 శాతానికి పెరిగితే.. ఈ నెలవారీ పెరుగుదల రూ.26,174కి చేరుకుంటుంది. కాగా ఈ ఏడాది మొదటి డీఏ ప్రకటన మార్చిలో రాగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసింది. గతంలో 38 శాతం ఉండగా.. 4 శాతానికి పెంచింది.
Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!
Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి