పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితులలో ఒకరైన బడా వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఈ విషయంలో ఏ పాపం తెలీదట. తనకు సంబంధం లేని విషయంలో తనని ఇరికించారని, అన్యాయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఆస్తులు అటాచ్ చేసిందని చెబుతూ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తానే స్వయంగా వీడియో ద్వారా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. పైగా తనపై చేస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని మెహుల్ చోక్సీ చెబుతున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.13,000 కోట్లు మోసం చేసి విదేశాలకు పారిపోయిన నిరవ్ మోడీకి సమీప బంధువైన మెహుల్ చోక్సీ కూడా ఆ కుంభకుణం తర్వాత దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే.
#WATCH Antigua: PNB Scam accused Mehul Choksi says, "all the allegations leveled by ED are false and baseless." pic.twitter.com/hkanruj9wl
— ANI (@ANI) September 11, 2018
ప్రస్తుతం చోక్సీ ఆంటిగ్వాలో ఉండగా అతడి న్యాయవాది అడిగిన ప్రశ్నలకు సమాధానం అతడు ఈ వీడియో పంపించినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది.
#WATCH PNB Scam accused Mehul Choksi on his passport revocation. Please note: ANI questions were asked by Mehul Choksi's lawyer in Antigua. pic.twitter.com/dwuPnOPaxd
— ANI (@ANI) September 11, 2018
పీఎన్బీ స్కామ్: నాకే పాపం తెలీదన్న చోక్సీ