Loksabha Elections 2024: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగుస్తోంది. చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ చివరి రోజున కీలక నేతల నామినేషన్లు మిగిలాయి.
ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు ఇవాళే చివరి తేదీ. రేపు అంటే ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తరువాత ఏప్రిల్ 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మే 13న ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణ, ఏపీ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నిన్న బుధవారం వరకూ అసెంబ్లీకు 3,644 నామినేషన్లు దాఖలు కాగా, లోక్‌సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే అసెంబ్లీకు 1294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఫురంధరేశ్వరి, మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరిలు నామినేషన్ వేయనున్నారు.
అటు తెలంగాణలో కూడా ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. తెలంగాణలో నిన్న చివరి నిమిషంలో మిగిలిన మూడు పార్లమెంట్ స్థానాల అభ్యర్ధులు ఖరారు కావడంతో ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మరోవైపు రేపు అంటే ఏప్రిల్ 26న దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. రెండో దశలో 1210 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
Also read: Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook