Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిన్నటి వరకూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కొనసాగగా ఇవాళ ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపుకు మళ్లింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరో వైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ వరకూ సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు వర్షాలు పడనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, కొమురం భీం, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక హైదరాబాద్ నగరంలో ఇవాళ, రేపు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. గరిష్టంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా.
ఇక ఏపీలోని ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. రాయలసీమలో కూడా ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
Also read: Vinesh Phogat Retirement: కుస్తీ గెలిచింది..నేను ఓడాను రెజ్లింగ్‌కు గుడ్ బై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook