High Court: భార్యపై భర్త అత్యాచారానికి పాల్పడినట్టు నమోదైన ఓ కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు(Chhattisgarh High Court) కీలక తీర్పు వెలువరించింది. చట్ట ప్రకారం వివాహం చేసుకున్న భార్య ఇష్టానికి విరుద్దంగా, బలవంతంగా శృంగారం చేస్తే.. అది అత్యాచారం(Rape) కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే భార్య వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో భర్త(Husband)ను కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తూ.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్కే చంద్రవంశీ(NK ChandraVamsi) తీర్పు ఇచ్చారు. అయితే అదే సమయంలో భార్య ఇతర ఆరోపణలకు సంబంధించి అతనిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇందులో భర్త తనతో అసహజమైన చర్యలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
వివరాల్లోకి వెళితే...
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలోని బెమెతారా జిల్లాకు చెందిన ఓ మహిళ.. తన భర్త బలవంతంగా, ఇష్టం లేకపోయినా శృంగారం(Sex) చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా భర్తతో పాటు, అతని కుటుంబ సభ్యులలో కొందరిపై వరకట్న వేధింపుల కేసు(Dowry harassment Case) కూడా నమోదు చేసింది. తాను 2017లో పెళ్లి చేసుకున్నట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. వివాహం తర్వాత ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా.. అనేక సార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడని, కట్నం కోసం హింసించాడని తన ఫిర్యాదులో చెప్పింది. దీంతో ఆ మహిళ భర్తపై బెమోతారా సెషన్స్ కోర్టు 498, 376, 377, 34 సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. దీంతో అతడు హైకోర్టులో అప్పీలు(Appeal) చేసుకున్నాడు.
Also Read:Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ హిమకోహ్లి
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్కే చంద్రవంశీ మాట్లాడుతూ.. ‘పద్దెనిమిదేళ్ల కంటే తక్కువ వయస్సు లేని భార్యతో శారీరక సంబంధం, లైంగిక చర్య అత్యాచారం కాదు. ఈ కేసులో.. ఇద్దరు భార్యభర్తలు. అందువల్లే భర్త ఆమెతో చేసిన లైంగిక చర్య(Sexual activity) అత్యాచార నేరం కాదు’ అని తెలిపారు.
తన భర్త తనతో అసహజమైన పనులు చేశాడని భార్య తన ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రైవేట్ భాగంలో వేలు పెట్టాడని.. అంతేకాకుండా ముల్లంగి కూడా ఉంచాడని చెప్పింది. ఈ కేసులో.. కోర్టు సెక్షన్ 377(Section 377) కింద భర్తపై అభియోగాలు మోపింది. ఏ విధంగానైనా అసహజ సెక్స్ చేయడం నేరం అని కోర్టు చెప్పింది. అపరాధి యొక్క ప్రధాన ఉద్దేశం అసహజమైన లైంగిక సంతృప్తిని పొందడం. సెక్స్(Sex) అవయవంలో లైంగిక భాగంలో పదేపదే ఏదైనా వస్తువును చొప్పించడం, తత్ఫలితంగా అసహజమైన రీతిలో లైంగిక ఆనందాన్ని పొందడం.. అటువంటి చర్య ప్రకృతి క్రమానికి వ్యతిరేకంగా శారీరక సంబంధాన్ని కలిగి ఉంటుందని, సెక్షన్ 377 ప్రకారం నేరం కిందకు వస్తుందని కోర్టు(Court) ఉత్తర్వుల్లో పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook