Assembly Elections 2023 Schedule: వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఫైనల్ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్‌కు నేడు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా మిజోరంలో నవంబర్ 7, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న, తెలంగాణలో నవంబర్ 30న, ఛత్తీస్‌గఢ్‌లో 7, 17వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానున్నాయి. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
ఓటర్లు ఎంతమంది..?
ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, రాజస్థాన్‌లో 5.25 కోట్లు, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రాజస్థాన్‌లో 200, తెలంగాణలో 119, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 24,109, మధ్యప్రదేశ్‌లో 64,523, మిజోరంలో 1,276, రాజస్థాన్‌లో 51,756, తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు.. సురక్షితంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుమన్నాని రాజీవ్ కుమార్ తెలిపారు. తాము ఐదు రాష్ట్రాలను సందర్శించి.. అన్ని పార్టీల ప్రతినిధులను కలిసి చర్చించామన్నారు. వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ బూత్‌ల గురించి మాట్లాడితే.. నిర్మించనున్నారు.
ఈ ఐదు రాష్ట్రాల్లో విజయం సాధించిన పార్టీ.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ఫుల్ జోష్‌లో వెళ్లనుంది. లోక్‌సభ ఫైనల్ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావించే మినీ కురుక్షేతంలో గెలవాలని అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకుని.. ముఖ్యమంత్రి పీటం సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.
Also Read: CM KCR: ఎన్నికల రంగంలోకి సీఎం కేసీఆర్.. ఆ రోజే మేనిఫెస్టో ప్రకటన
Also Read: Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? రూల్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి