అయోధ్యలోని రామ మందిరాన్ని భారత్కు చెందిన ముస్లింలు కూల్చలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. 'భారత ముస్లింలు రామ మందిరాన్ని కూల్చలేదు. భారతీయులు ఈ తరహా పనులు చేయరు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విదేశీ శక్తులు ఈ కుట్ర చేశాయి' అని పాల్గన్ జిల్లా దహనులో జరిగిన విరాట్ హిందూ సమ్మేళన్లో ఆదివారం పేర్కొన్నారు. రామ మందిరాన్ని పునర్నిర్మించుకోవడం భారతీయులందరి బాధ్యత అని అన్నారు.
'అయోధ్యలో రామమందిరాన్ని కూల్చింది విదేశీ శక్తులు. దీన్ని పునర్నిర్మించుకోవడం దేశ ప్రజలందరి బాధ్యత. ఈ ఆలయం ఎక్కడైతే ఉందో అక్కడే నిర్మించబడాలి. అందుకోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాము' అన్నారాయన. ఎన్నికల్లో ఓడిన పార్టీలు కులం కార్డుతో తిరిగి పోరాడుతున్నాని ఆయన ఎద్దేవా చేశారు. రామ్ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉంది.