Bihar Election result 2020: బిహార్ ఎన్నికల ఫలితాలు.. మళ్లీ ఎన్డీఏయేకే అధికారం..

Bihar elections result 2020: న్యూ ఢిల్లీ: బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు ముగిస్తున్నా కొద్ది ఉత్కంఠరేపిన బిహార్ ఎన్నికల ఫలితాలలో చివరకు బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిదే పై చేయి అయింది.

Last Updated : Nov 11, 2020, 04:41 AM IST
Bihar Election result 2020: బిహార్ ఎన్నికల ఫలితాలు.. మళ్లీ ఎన్డీఏయేకే అధికారం..

Bihar elections result 2020: న్యూ ఢిల్లీ: బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు ముగిస్తున్నా కొద్ది ఉత్కంఠరేపిన బిహార్ ఎన్నికల ఫలితాలలో చివరకు బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిదే పై చేయి అయింది. బిహార్‌లో మొత్తం 243 స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 122 మేజిక్ ఫిగర్‌ని దాటి స్పష్టమైన మెజారిటీతో 125 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది.

Also read : IPL 2020 final match: ఐదోసారి ఐపిఎల్ ట్రోఫీ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

బిహార్ ఎన్నికల ఫలితాల్లో ( Bihar Election results 2020 ) పార్టీలు కైవసం చేసుకున్న స్థానాల సంఖ్యను పరిశీలిస్తే... బీజేపి-74, ఆర్జేడీ-75, జేడీయూ-43, ఎల్జేపీ-01, కాంగ్రెస్-19, సీపీఐఎంఎల్-11, సీపీఎం-03, ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. బిహార్‌లో నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలో తిరిగి సీఎం నితీష్ కుమార్ ఐదోసారి అధికారం చేపట్టనున్నారు. బీజేపి అధిక స్థానాలు గెల్చుకున్న నేపథ్యంలో ఈసారి ఆ పార్టీకి అధికారంలో అధిక ప్రాధాన్యత లభించనుందని తెలుస్తోంది. ఎన్డీఏ పట్ల ఓటర్లు చూపించిన విశ్వాసంపై ఆ కూటమి నేతలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Union Home minister Amit Shah ) ట్విటర్ ద్వారా బిహార్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. బిహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డబుల్ ఇంజిన్ తరహాలో శ్రమించి రాష్ట్రాన్ని అభివృద్ధిపర్చారని పేర్కొన్నారు.

Also read : MP Bypoll: ఈవీఎం ట్యాంపరింగే బీజేపీ విజయానికి కారణం: దిగ్విజయ్ సింగ్

బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయంపై ఆ రాష్ట్రానికే చెందిన కేంద్ర మంత్రి, బీజేపి నేత అశ్విని కుమార్ చౌబె ( Ashwini Kumar Choubey ) మాట్లాడుతూ.. ''బిహార్ రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌ని ఎన్నుకుని డబుల్ యువరాజ్‌ని తిరస్కరించారు'' అంటూ ఆర్జేడీని ఎద్దేవా చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

 

Trending News