Leopard Strays Into School: ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ జిల్లాలో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక చర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరి నిహాల్ సింగ్ పాఠశాలలో చిరుత పులి ప్రవేశించింది. ఆ కాలేజీలో ప్రవేశించి విద్యార్థులను భయాందోళనలకు గురిచేసింది. దీంతో పాటు ఓ తరగతి గదిలో విద్యార్థిపై దాడి చేసింది. వెంటనే చాకచక్యంగా పులి బారి నుంచి ఆ విద్యార్థిని కాపాడారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆ బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు.
ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్ అలీగఢ్ లోని చౌదరి నిహాల్ సింగ్ పాఠశాలలో 15 ఏళ్ల బాలుడు లక్కీ రాజ్ సింగ్.. పదో తరగతి చదువుతున్నాడు. తన తరగతి గదిలో ఈ రోజు ఉదయం 8.30 గంటలకు సమయంలో చిరుత పులి ప్రవేశించింది. అయితే అప్పటికే ఆ గదిలో లక్కీ రాజ్ ఒక్కడే ఉన్నాడు. పులి రాకను గమనించకుండా.. తరగతి గదిలో కింద కూర్చున్నాడు.
#watch: A student of class X was attacked by a #leopard while he was entering his class at Chaudhary Nihal Singh inter college in #Aligarh’s Chharra area around 8:30 am today. The student has been sent to a hospital for treatment. Rescue operation in on. pic.twitter.com/za1Iee7fSJ
— Anuja Jaiswal (@AnujaJaiswalTOI) December 1, 2021
అతడ్ని గమనించిన పులి.. ఆ బాలుడి దగ్గరకు వచ్చేసింది. అయితే గది నుంచి లక్కీ రాజ్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. అంతలోనే పులి తన పంజాతో అతడిపై దాడి చేసింది. రక్త స్రావంతో బాలుడు పెద్దపెద్దగా కేకలు వేశాడు. అది గమనించిన స్కూల్ టీచర్లు.. పులి పారిపాయేలా చేసి.. ఆ బాలుడ్ని కాపాడారు.
“నేను తరగతి గదిలో ఉన్నప్పుడు.. చిరుత పులి కనిపించింది. నేను అక్కడి నుంచి పారిపోయే లోపే.. అది నా వీపుపై కరిచింది. దాంతో నాకు రక్తస్రావం అయ్యింది” అని ఆ విద్యార్థి లక్కీ రాజ్ సింగ్ వెల్లడించాడు.
Another video : leopard sitting inside the classroom. #Aligarh pic.twitter.com/dH5t7CcRMM
— Anuja Jaiswal (@AnujaJaiswalTOI) December 1, 2021
Also Read: Smartphone For Vaccination: బంపర్ ఆఫర్.. వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.60 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ!
Also Read: Lady Constable Gender Reassignment: లేడీ కానిస్టేబుల్ లింగ మార్పిడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook