Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలన పరిణామం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచింది. ఇద్దరిని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాంలో ఏ5గా ఉన్న మహారాష్ట్రకు చెందిన వ్యాపారి విజయ్ నాయర్ తో పాటు ఇండో స్పిరిట్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసింది.ఢిల్లీలో 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసింది సీబీఐ. విజయ్ నాయర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రధాన అనుచరుడు.
విజయ్ నాయర్ గతంలో ముంబై కేంద్రంగా నడిచిన ఓన్లీ మచ్ లౌడర్ సంస్థకు సీఈఓగా పనిచేశారు. లిక్కర్ స్కాంలో ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ కీలకంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహచరుడు అర్జున్ పాండేతో పాటు విజయ్ నాయర్ డీల్ చేశారు. ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నగదు మనీష్ సిసోడియాకు చేరిందనే ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు. కుంభకోణానికి సహకరించిన ఢిల్లీ ఎక్సైజ్ అధికారులకు విజయ్ నాయరే డబ్బు ఇచ్చినట్లు సమాచారం. లిక్కర్ స్కాంలో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో నెక్స్ట్ అరెస్టులు తెలంగాణ నుంచే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్ లో సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ స్కాంలో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసంతో పాటు అతని వ్యాపార భాగస్వామ్యులు సూదిని సృజన్, బోయినపల్లి అభిషేక్, గండ్ర మోహన్ రావు నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. సీఏ బుచ్చిబాబు ఇంట్లోనూ తనిఖీలు చేశారు. బిల్డర్ వెన్నమనేని శ్రీనివాస్ రావును ఈడీ అధికారులు ప్రశ్నించారు. తెలంగాణ నుంచే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలో అరెస్టులు తప్పవచ్చని సమాచారం.
Also Read : పద్మాలయ స్టూడియోస్ కు ఇందిరా దేవి పార్ధివ దేహం.. అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే?
Also Read : PFI Ban: పీఎఫ్ఐకు ISIS లింకులు! దేశ భద్రతకు ముప్పు... ఐదేళ్ల పాటు నిషేదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి