Cement Price Reduced: దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు దిగిరానున్నాయి. సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడం వల్ల సౌత్ ఇండియా సిమెంట్ తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల సిమెంట్ బస్తాపై రూ.20- 40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో సిమెంట్ బస్తాకు రూ.40.. తమిళనాడులో బస్తాకు రూ.20 వరకు తగ్గించనున్నట్లు సిమెంట్ డీలర్లు వెల్లడించారు. కేరళ, కర్ణాటల్లోనూ రూ.20-40 వరకు కోత విధించారు.
ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా తెలుగు రాష్ట్రాల్లో రూ.280-320కి పరిమితం కానుంది. తమిళనాడులో ఒక టాప్ బ్రాండ్ సిమెంటు ధర రూ.400 దిగువకు రాగా.. కర్ణాటక, కేరళల్లోనూ బస్తా ధర రూ.360-400 నుంచి రూ.340-380కి చేరినట్లు డీలర్లు వివరించారు.
సిమెంట్ ధరలు తగ్గించిన కంపెనీల్లో అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, సాగర్ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, చెట్టినాడ్ సిమెంట్, ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్, దాల్మియా భారత్, శ్రీ సిమెంట్, హెడల్‌బర్గ్ సిమెంట్ ఇండియా తదితరాలున్నాయి.
Also Read: Girls Molested in UP: ఆహారంలో మత్తు మందు కలిపి 17 మంది బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook