special trains for kumbh mela says Ashwini Vaishnav: కుంభమేళకు పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతునే ఉంది. మన దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహాకుంభమేళ కావడంతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వయస్సు వరకు ప్రతి ఒక్కరు ఎలాగైన త్రివేణి సంగమంలో వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కుంభమేళలో రద్దీ బీభత్సంగా ఉంది.
దాదాపు.. 300 కి.మీ. మేర కుంభమేళకు వెళ్లే దారులన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. బస్సులు, రైల్వేలు, విమానాలు, ప్రైవేటు వాహానాలన్ని కిక్కిరిసిపోయాయి. అంతే కాకుండా.. కుంభమేళకు వెళ్లే భక్తుల కోసం ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా రైళ్లను నడుపుతుంది.
Yesterday, 12.5 lakh pilgrims were facilitated and a record 330 trains departed from Prayagraj Mahakumbh area stations. Today, 130 trains have departed from the mela area so far.
All Mahakumbh mela railway stations are operating smoothly. pic.twitter.com/XwuyROinR8— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 10, 2025
ఇదిలా ఉండగా.. ఇటీవల కుంభమేళకు భారీగా భక్తులు వస్తుండటంతో.. ప్రయాగ్ రాజ్ లోని సంగం రైల్వే స్టేషన్ ను మూసి వేశారని వార్తలు వచ్చాయి. అదే విధంగా అనేక రైళ్లను కూడా తాత్కలికంగా క్యాన్సిల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.
కుంభమేళ ప్రయాగ్ రాజ్ లో 8 రైల్వే స్టేషన్ ల నుంచి రైళ్లు రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడకూడా రైళ్లను క్యాన్సిల్ చేయలేదన్నారు. అదే విధంగా నిన్న ఒక్కరోజు కుంభమేళ నుంచి 330 రైళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లాయన్నారు. ప్రతిరోజు ప్రయాగ్ రాజ్ కు వచ్చే రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. దీనికి తగ్గట్టుగానే సిబ్బందిని సైతం షిఫ్టుల వారిగా డ్యూటీలు చేస్తున్నారన్నారు.
Read more: Maha kumbh: మహా కుంభమేళలో ఇంకా ఎన్ని షాహీ స్నానాలు ఉన్నాయి.. వాటి ప్రాముఖ్యత.. ఎప్పుడో తెలుసా..?
ఎక్కడ కూడా ప్రయాణిలకు ఇబ్బందులు కలిగే విధంగా ఎలాంటి చర్యలు తీసుకొవడంలేదన్నారు. కొంత మంది పనికట్టుకుని రైల్వేకు చెడ్డపేరు వచ్చేలా మాట్లాడుతున్నారని, అవన్ని పట్టించుకొవదన్నారు. ట్రైన్ లు యథావిధిగా నడుస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెల్చి చెప్పారు. వచ్చే మాఘిపౌర్ణమి, మహా శివరాత్రి నేపథ్యంలో మరిన్ని ట్రైన్ లను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రరైల్వే మంత్రి స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter