Corona in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్థిరంగా (Corona cases in India) పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది.
మహారాష్ట్రలో తాజాగా 46,723 కరోనా కేసులు (Corona cases in Maharashtra) నమోదయ్యాయి. 32 మంది కొవిడ్‌తో మృతి చెందారు. 28,041 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం 2,40,122 యాక్టివ్ కరోనా (Active Corona cases in Maharashtra) కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Omicron cases in Maharashtra) 1,367 వద్ద ఉంది.
ముంబయిలో కాస్త తగ్గిన కొవిడ్ కేసులు..
ముంబయిలో బుధవారం ఒక్క రోజే 16,420 కరోనా కేసులు (Corona cases in Mumbai) నమోదయ్యాయి. మరో 7 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. ముంబయిలో రికవరీ రేటు 87 శాతంగా ఉంది.
ప్రస్తుతం ముంబయిలో యాక్టివ్ కరోనా కేసులు (Active Corona cases in Mumbai) 102,282 వద్ద ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
ఢిల్లీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. బుధవారం ఒక్క రోజే ఇక్క 27,561 మందికి పాజిటివ్‌గా తేలింది. 40 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 87,445కు చేరాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 26.22 శాతంగా ఉంది.
పశ్చిమ్ బెంగాల్లో కొవిడ్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. కొత్తగా 22,155 కరోనా కేసులు బయటపడ్డాయి. 23 మంది కొవిడ్‌కు బలయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,16,251కు చేరింది. పాజిటివిటీ రేటు 30.86 శాతానికి పెరిగింది.
కర్ణాటకలో 21,390 కొవిడ్ కేసులు (Corona cases in Karnataka) నమోదవగా.. గడిచిన 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. ఇక 1,541 మంది కొవిడ్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93,099 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also read: ISRO New Chairman Somanath: ఇస్రో నూతన ఛైర్మన్‌గా సోమనాథ్ నియామకం
Also read: Boxer Lovlina: అసోం డీఎస్పీగా బాక్సర్ లవ్లీనాకు బాధ్యతలు అప్పగింత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook