UK Strain Virus: యూకే నుంచి వచ్చే వారి కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం!

Coronavirus SOPs India: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో యూకేలో కొత్త స్ట్రెయిన్ జాడ తెలిసిన విషయం తెలిసిందే. 

Last Updated : Jan 2, 2021, 02:57 PM IST
    1. కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో యూకేలో కొత్త స్ట్రెయిన్ జాడ తెలిసిన విషయం తెలిసిందే.
    2. భారత దేశంలో కూడా 25 మందికి ఈ కొత్త రకం వైరస్ సోకిన తరుణంలో భారత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది.
UK Strain Virus: యూకే నుంచి వచ్చే వారి కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం!

Coronavirus SOPs India: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో యూకేలో కొత్త స్ట్రెయిన్ జాడ తెలిసిన విషయం తెలిసిందే. భారత దేశంలో కూడా 25 మందికి ఈ కొత్త రకం వైరస్ సోకిన తరుణంలో భారత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది. యూకే నుంచి రానున్న ప్రయాణికుల విషయంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం.

Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చే ప్రయాణికులకు పౌరవిమానయాన సంస్థ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నియమాలు జనవరి 8, 2021 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ స్టాండర్డర్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం యూకే నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్-19 (Covid-19) నెగెటీవ్ ఉన్నట్టు రిపోర్ట్ అందించాల్సి ఉంటుంది. ప్రయాణానికి ముందు 72 గంటల ముందు నిర్వహించిన పరీక్ష ఫలితాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు.

Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

యూకే (United Kingdom) నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్‌లో ప్రవేశించిన తరువాత నిర్వహించిన టెస్టుల్లో పాజిటీవ్‌ అని తేలితే సదరు ప్రయాణికుడి పక్కన, వెనక కూర్చున్ను వారిని కూడా క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు. తరువాత వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచుతారు. తరువాత టెస్టులు నిర్వహించి నెగెటీవ్ వస్తేనే అక్కడి నుంచి బయటికి పంపిస్తారు. లేదంటే నెగేటీవ్ వచ్చేంత వరకు అక్కడే ఉంచుతారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News