Delhi Assembly Elections Results 2025: వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికార పీఠం దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ సింహాసనం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. వరుసగా ఆరు సార్లు బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల బడింది. అదే సమయంలో ఎంపీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తూ వస్తోంది. మరోవైపు పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఢిల్లీలో బీజేపీ కి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పాయి. కొన్ని మాత్రం ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే ఓట్ల లెక్కింపులో అక్కడ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారనేది ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైంది. అది మరికాసేట్లో ఎవరు విజేతలుగా నిలువనున్నారు. ఎవరు పరాజితులు కానున్నారనేది తేలిపనుంది.
ఈ సారి జరిగిన ఢిల్లీ శాసన సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా కాగను పుట్టించాయి. అన్ని పార్టీలు ప్రచారంలో హోరెత్తించాయి. ఢిల్లీ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో 1993లో బీజేపీ ఫస్ట్ టర్మ్ మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఆయన్ని ప్లేస్ లో సాహిబ్ సింగ్ వర్మను సీఎంను చేసింది. రెండున్నరేళ్ల తర్వాత చివర్లో సుష్మా స్వరాజ్ ను ఢిల్లీ సీఎం అయింది. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోరంగా ఎన్నికల్లో ఓటమి పాలైయింది. ఆ తర్వాత 1998, 2003, 2008లో జరిగిన ఎన్నికల్లో వరుసగా షీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 15 యేళ్లు ఢిల్లీని ఏలింది. ఆమె హయాంలోనే మెట్రో రైలు సహా ఢిల్లీలో పలు అభివృద్ది కార్యక్రమాలు పురుడు పోసుకున్నాయి. ఆ తర్వాత 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ఆప్, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య ఏర్పడిన విభేదాలు కారణంగా ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత 2015 ఆప్ .. 70 సీట్లకు గాను 67 సీట్లలో గెలిచి సంచలనం రేపింది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఆ తర్వాత 2020లో 62 సీట్లలో గెలిచింది.ఆ సమయంలో బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. తాజాగా 2025లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్టు పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. ఎన్నికల తర్వాత వెలుబడిన ఎగ్జిట్ పోల్స్ లు హస్తిన పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతున్నట్టు చెప్పాయి. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ మద్యం కుంభకోనం ఆరోపణలు రావడం,సెంటర్ లో ఉన్న ప్రభుత్వం కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆప్ విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని బీజేపీ పిలుపుపై దేశ రాజధాని ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో మరికాసేట్లో తేలనుంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.