Delhi Crime Issue: తల్లి అంటేనే ప్రేమకు..దయకు చిహ్నం. అదే సమయంలో లోకంలో కర్కశత్వానికి మారుపేరుగా నిలిచే తల్లులు కూడా ఉంటారా అంటే..అవుననే సమాధానం విన్పిస్తుంది. అదే జరిగింది దేశ రాజధాని నగరం ఢిల్లీలో..
సృష్టిలో అందమైన పదం..అందమైన సృష్టి కూడా అమ్మే. ఆ పదమే ఓ మధురం. ఓ జ్ఞాపకం. దయకు, ప్రేమకు, ఆప్యాయతకు పర్యాయపదం. అందుకే బిడ్డ ఏడిస్తే చాలు కన్నతల్లి తల్లడిల్లిపోతుంది. చిన్న దెబ్బ తగిలినా..ఆ అమ్మ హృదయం విలవిల్లాడుతుంది. మరి దేశ రాజధాని ఢిల్లీలో ఆ తల్లి చేసిన పనికి ఏమనాలి..ఆ తల్లిని ఏ పేరుతో పిలవాలి..మాతృత్వానికే మాయని మచ్చగా, కర్కశత్వంగా వహించిన ఆ తల్లిని ఏం చేయాలి. ఢిల్లీ ఘటన వింటే ఇవే ప్రశ్నలు ఉదయిస్తాయి.
ఢిల్లీలోని మాళవీయ నగర్, చిరాగ్ ఏరియాలో గుల్షన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ దంపతులకు 2 నెలల క్రితం పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆడపిల్లంటే ఇష్టం లేని డింపుల్..ఆ పసిబిడ్డను గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత వంటగదిలోని మైక్రోఓవెన్‌లో పెట్టి కాల్చేసింది. పక్కగదిలోని నానమ్మ ఈ ఘటన చూసి గట్టిగా కేకలేసింది. దాంతో వంటగది లాక్ చేసేసింది. ఆ వృద్ధురాలి కేకలతో అక్కడికి చేరుకున్న చుట్టుపక్కలవాళ్లు..జరిగింది విని విస్తుపోయారు. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు గది తలుపులు పగలగొట్టి ఓవెన్‌లో చూడగా..ఆ పసిబిడ్డ మరణించి ఉంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ దంపతుల్ని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన గురించి విన్న మాళవియ నగర్ స్థానికులు విస్తుపోతున్నారు. ఇంతటి కర్కశమైన తల్లులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు.
Also read: Lalu Yadav Health: మరింతగా క్షీణించిన లాలూ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Delhi Crime Issue: 2 నెలల పసికందుపై కర్కశం..మైక్రోఓవెన్‌లో పెట్టి చంపేసిన తల్లి