TRS MLAS BRIBE: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఫాంహౌజ్ డీల్ కు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు, వరుసగా లీకవుతున్న ఆడియోల్లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆపరేషన్లు నిర్విహించామంటూ స్వామిజీలు మాట్లాడుకోవడం దుమారం రేపుతోంది. రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ ఫోన్ సంభాషణల్లో ఢిల్లీ, బెంగాల్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రస్తావన వచ్చింది. దీంతో ఈ అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి ఆధారాలు బయటపెడుతారోనన్న ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో వెలుగుచూసిన ఎమ్మెల్యేల బేరసారాల అంశంపై తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. బీజేపీ తీరుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటూ బీజేపీ రెడ్ హ్యాండడ్ గా దొరికిందన్నారు సిసోడియా. పదవులు, డబ్బులతో ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని విమర్శించారు. బీజేపీలో చేరితే ఈడీ, సీబీఐలు మీ జోలికి రావంటూ బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తుందన్నారు. ఎమ్మెల్యేలను కొనడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. ఇంత డబ్బు బీజేపీకీ ఎక్కడి నుంచి వస్తుందన్నారు సిసోడియా. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉండం సిగ్గుచేటన్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.దేశంలో బీజేపీ ఆధ్యర్యంలో ఆపరేషన్ లోటస్ పేరుతో వికృత క్రీడా నడుస్తోందన్నారు సిసోడియా. ప్రజల ఓట్లతో గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. సైబరాబాద్ లో బీజేపీ కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దళారి వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. 100 కోట్ల రూపాయలతో ముగ్గురు దళారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారని చెప్పారు.
दिल्ली में 43 MLAs को तोड़ने की कोशिश कर रही है भाजपा. तेलंगाना में MLA ख़रीदने की कोशिश में ₹100 करोड़ के साथ पकड़े गए इनके दलाल ने खुद क़बूला है कि इसी तरह 25-25 करोड़ में दिल्ली के MLA ख़रीदने के लिए पैसा रखा हुआ है.
कहाँ से आ रहा है 43 MLA ख़रीदने के लिए 1075 करोड़ रुपया? https://t.co/k7OGHWuDXn
— Manish Sisodia (@msisodia) October 29, 2022
ఫాంహౌజ్ లో పట్టుబడిన ముగ్గురికి బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు సిసోడియా. వాళ్లు మాట్లాడిన ఆడియో టేపుల్లో ఎమ్మెలందరిని తీసుకురండి... డబ్బులు, సెక్కూరిటీ, పదవులు ఇస్తామని ఆఫర్ చేశారని చెప్పారు. ముందు మీరు రండి బీఎల్ సంతోష్ తో మాట్లాడి నంబర్ 2తో సమావేశం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఢిల్లీలో కూడా అక్కడి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తున్నామని నిస్సుగ్గుగా చెబుతున్నారని సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. 43 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా సిద్ధం అయ్యాయని ఆడియోలో చెప్పారన్నారు. 43 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.1075 కోట్లు ఎక్కడివి? అని సిసోడియా ప్రశ్నించారు. అసలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరివీ?.. అమిత్ షా వా? లేక బీఎల్ సంతోష్ వా... ఎవరివి?.. కేంద్ర హోంశాఖ మంత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారా? అని నిలదీశారు. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఇది త్రీవతరమైన సమస్యన్న మనీశ్ సిసోడియా.. కేంద్ర హోంశాఖ మంత్రిని తప్పించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : Jr NTR : సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్
Also Read : KTR COMMENTS: ఎమ్మెల్యే బేరసారాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి