GAS PRICE HIKE: వినియోగదారులకు చమరు కంపెనీలు మళ్లీ షాకిచ్చాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై 50 రూపాయలు పెంచాయి.పెరిగిన ధరలు ఈ రోజు నుంచే(జూలై6 ) అమలులోనికి వచ్చాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు పెరిగింది.
సాధారణంగా ప్రతి నెల 1న గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయి. జూలై 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు 183.50 రూపాయల మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్ ధర మాత్రం పెంచేసాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం కాస్త తగ్గింది.
Read also: AP Schools: నాడు- నేడు అంటే ఇదేనా.. ఏపీలో 8 వేల ప్రభుత్వ స్కూళ్లు మాయం!
Read also: Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. కొస్తాంధ్ర, గోదావరి జిల్లాలో అర్ధరాత్రి కుండపోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook