National Media Awards 2021: కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ మీడియా అవార్డుల్ని ప్రకటిస్తోంది. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నాలుగు ప్రధాన కేటగరీల్లో ఈ పురస్కారాలు అందనున్నాయి. అవార్డుల కోసం ఎంట్రీలు పంపించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆహ్వానిస్తోంది.
ఓటు హక్కు(Right to Vote)వినియోగంపై ఓటర్లలో చైతన్యం నింపడం, అవగాహన కల్పించే విషయంలో విశేష కృషి చేసిన ఉత్తమ ప్రచార మాధ్యమాలకు జాతీయ మీడియా అవార్డుల్ని ప్రధానం చేసేందుకు భారత ఎన్నికల ( సంఘం ఎంట్రీలు ఆహ్వానిస్తోంది. 2012 నుంచి చేసిన కృషిని పరిగణలో తీసుకుని ఈ అవార్డులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి కే విజయానంద్ తెలిపారు. ప్రింట్, టివి, రేడియో, సోషల్ మీడియా విభాగాలు మొత్తం 4 కేటగరీల్లో అవార్డులు ఇవ్వనున్నారు. నవంబర్ 30 తేదీలోగా ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపించాల్సి వస్తుంది. 2022 జనవరి 25వ తేదీన జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఉత్తమ మీడియా సంస్థలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులో భాగంగా సైటేషన్, ఫలకం ప్రదానం చేయనున్నారు.
ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేందుకు, ఓటు హక్కు వినియోగంపై చైతన్యం కల్పించేందుకు, ఓటరు నమోదు, రిజిస్ట్రేషన్ వంటి అంశాల్లో విశేష కృషి చేసిన మీడియా సంస్థలకు ఈ అవార్డులు అందించనున్నారు. భారత ఎన్నికల సంఘం(Election Commission)ఏర్పాటు చేసిన ప్రత్యేక జ్యూరీ మాధ్యమాలు నిర్వహించిన క్వాలిటీ ఆఫ్ ఓటర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్, ఎక్స్టెంట్ ఆఫ్ కవరేజ్ అండ్ క్వాంటిటీ. ఓటరు అవగాహనా కార్యక్రమాల ఆధారంగా ఉత్తర ఎంట్రీల్ని ఎంపిక చేసి పురస్కారాలు అందిస్తారు. ఎంట్రీలకు సంబంధించి ప్రింట్ మీడియా న్యూస్ ఆర్టికల్స్ వివరాలు సాఫ్ట్ కాపీ పీడీఎఫ్ లేదా న్యూస్ పేపర్ ఆర్టికల్ ఫుల్‌సైజ్ ఫోటో కాపీ లేదా ప్రింట్ కాఫీ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. బ్రాడ్‌కాస్ట్ టెలివిజన్ లేదా రేడియోలైతే క్యాంపెయిన్‌కు సంబంధించిన సీడీ లేదా డీవిడీ లేదా పెన్‌డ్రైవ్ ద్వారా వివరాలు సమర్పించాలి. ఇక స్పాట్‌న్యూస్ వివరాలు, న్యూస్ ఫీచర్ లేదా ప్రోగ్రామ్‌లకు సంబంధించి సీడి లేదా డివిడి లేదా పెన్‌డ్రైవ్ ద్వారా టెలీకాస్ట్ అయిన వ్యవధి, సమయం, తేదీ, ఫ్రీక్వెన్సీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లేదా సోషల్ మీడియా ఎంట్రీలు పంపించేవారు ఓటర్ల అవగాహనకు సంబంధించి నిర్దేశిత సమయంలో చేసిన పోస్టులు, బ్లాగ్స్, క్యాంపెయిన్ లేదా ట్వీట్స్ లేదా ఆర్టికల్స్ వివరాల్ని పంపించాల్సి ఉంటుంది.
ఓటర్లలో చైతన్యం, అవగాహనపై నేషనల్ మీడియా అవార్డ్స్ 2021కు(National Media Awards 2021) ఎంట్రీలు పంపించేవారు హిందీ, ఇంగ్లీషు తప్ప మిగిలిన భాషలకు ఇంగ్లీష్ అనువాదం పంపించాలి. ప్రతి ఎంట్రీకు తప్పనిసరిగా మీడియా హౌస్ పేరు, అడ్రస్, టెలీఫోన్ నంబర్, ఫ్యాక్స్ నెంబర్లు, ఈ మెయిల్ ఉండాలి. ఎంట్రీలను పవన్ దివాన్, అండర్ సెక్రటరీ కమ్యూనికేషన్స్, ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోక్ రోడ్, న్యూఢిల్లీకు పంపించాలి. media-division@eci.gov.in లేదా 011-23052133 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
Also read; Diwali Gift Ideas: దీపావళికు మీ బంధుమిత్రులకు ఈ బహుమతులివ్వండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి