Farmer protests: 17వ రోజుకు రైతుల ఉద్యమం.. నేడు రహదారుల దిగ్బంధం

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు చేస్తున్న ఆందోళనలు (Farmer protests) 17వ రోజుకు చేరుకున్నాయి.

Last Updated : Dec 12, 2020, 09:36 AM IST
Farmer protests: 17వ రోజుకు రైతుల ఉద్యమం.. నేడు రహదారుల దిగ్బంధం

Farmer protests live: Farmers to block major highways: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు చేస్తున్న ఆందోళనలు (Farmer protests) 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ చట్టాలపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వం (central government), రైతు సంఘాల మధ్య చర్చలు జరగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేయాలని రైతు సంఘాలు ( Farmers Organizations) పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారులను రైతులు దిగ్బంధించనున్నారు. టోల్‌గేట్ల వద్ద పన్ను చెల్లించకుండా నిరసన తెలపనున్నారు.  

రైతులకు మద్దతుగా ఇప్పటికే పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల నుంచి భారీగా అన్నదాతలు ఢిల్లీ ( Delhi ) పరిసరాలకు చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ పరిసరాల్లో భద్రతను భారీగా పెంచారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులను మూసివేశారు. Also read: Farmer protests: వ్యవసాయ చట్టాలపై సుప్రీంను ఆశ్రయించిన రైతులు

ఇదిలాఉంటే.. ఈనెల 14న ఉత్తర భారతదేశంలోని రైతులంతా ఢిల్లీని ముట్టడించాలని, దక్షిణ భారతదేశంలోని రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (Bhartiya Kisan Union)  శుక్ర‌వారం సుప్రీం కోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలు చేసింది. Also read: Dress Code for Employees: మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News