మీరు తత్కాల్ రైలు టికెట్ బుక్ చేసుకున్నారా.. అయితే మీకు ఇది కచ్చితంగా శుభవార్తే..! ఎందుకంటే తత్కాల్ క్రింద బుక్ చేసుకొనే ఏ రైల్వే టికెట్‌కైనా కొన్ని పరిమితులతో ఇక నుండి 100 % రిఫండ్ ఇస్తున్నట్లు ఇండియన్ రైల్వే శాఖ తెలిపింది. ఆన్లైన్ టికెట్లతో పాటు కౌంటర్ నుండి తీసుకొనే టికెట్లకు కూడా ఈ రిఫండ్ పద్ధతి వర్తిస్తుందని భారతీయ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ్యంగా రైలు వచ్చే సమయం మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైనప్పుడు ఈ రిఫెండ్ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. అలాగే రైలును దారి మళ్లిస్తే కూడా ఈ రిఫెండ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా, రైలు ఎక్కాల్సిన స్టేషను లేదా దిగాల్సిన స్టేషను కూడా రెగ్యులర్‌గా కూడా వేరే దారిలో వెళ్తున్నప్పుడు.. ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్ ట్రైన్‌కు కనెక్ట్ చేయనప్పుడు, అందుకు ఆల్టర్నేటివ్ సౌకర్యం కల్పించనప్పుడు ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. అలాగే తత్కాల్ క్రింద రిజర్వేషన్ చేసుకున్న క్లాస్‌కు బదులుగా వేరే రైల్వే వారు సూచించే వేరే క్లాసులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఇష్టపడకపోయినా.. ఈ రిఫెండ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.