Corona Cases in India: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మరోసారి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,326 కేసులు నమోదయ్యాయి. మరో 453 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 79,097గా ఉంది. ఒమిక్రాన్ కేసులు కూడా దేశంలో నానాటికి పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 171 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో ఇప్పటి వరకు 3,47,52,164 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి 4,78,007 మరణాలు సంభవించాయి. అయితే కొవిడ్ బారి నుంచి దాదాపుగా 3,41,95,060 మంది కోలుకోవడం విశేషం.
#IndiaFightsCorona#COVID19 UPDATE (As on 21th December, 2021)
➡️5,326 daily new cases in the last 24 hours
➡️Daily positivity rate reported to be 0.53% #Unite2FightCorona #StaySafe
1/4 pic.twitter.com/zrnUXBtuF9
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) December 21, 2021
కొవిడ్ వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ శరవేగంగానే కొనసాగుతోంది. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,38,34,78,181కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు..
ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ వాటానే అధికంగా ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 5,45,626 కేసులు నమోదయ్యాయి. 4,939 మంది మరణించారు.
ALso Read: Free Tabs For Students: రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా మొబైల్స్, ట్యాబ్స్ పంపిణీ
Also Read: Omicron Detection Kits: ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపు ఇకపై సులభం, త్వరలో డిటెక్షన్ కిట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి