India vs Bharat Row: కేంద్ర ప్రభుత్వానికి దేశం పేరు మార్చే ఆలోచన నిజంగానే ఉందా లేదా..అసలు వాస్తవమేంటి, ఎందుకీ ప్రచారం జరుగుతోంది, విపక్షాలు ఏమంటున్నాయి, కేంద్రం ఏమంటోంది అనే వివరాలు ఓసారి పరిశీలిద్దాం..
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. జీ20 సదస్సు విందు ఆహ్వానానికి కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ఆహ్వాన పత్రంతో ఈ రచ్చ ప్రారంభమైంది. ఇందులో ప్రెసిడెంట్ ఆప్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. అంతే ఈ కార్డుతో రచ్చ రేగింది. దేశం పేరు మార్చేస్తున్నారని కొందరు, ఇప్పుడు అంత హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మరి కొందరు ఇలా ఎవరికివారు వాదిస్తున్నారు. దీనికి తోడు తాజాగా ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన ఓ కరపత్రంలో కూడా తాజాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. దాంతో పేరు మార్చేస్తున్నారని, ఇదే నెలలో అంటే సెప్టెంబర్ 18-22 తేదీల మధ్య జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నారనే వాదన విన్పిస్తోంది.
అటు విపక్షాలైతే కొత్తగా ఏర్పర్చుకున్న ఇండియా కూటమి పేరు నేపధ్యంలో దేశం పేరుని మార్చేస్తోందని విమర్శలు ప్రారంభించింది. ఇక బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికే వర్గమైతే పరాయివాడు పెట్టిన పేరెందుకు, అందుకే మార్చేస్తున్నామని మరో వాదన ప్రారంభించాయి. వాస్తవానికి ఇప్పటి వరకూ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అంతా ఊహాగానాలు, మీడియా రచ్చ తప్ప మరేదీ లేదు. ఇప్పుడీ అంశంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
ఇండియా పేరును భారత్‌గా మార్చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా కేవలం పుకార్లని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. భారత్ అనే పేరు పట్ల వారికున్న మనస్తత్వమేంటో దీనిని బట్టి స్పష్టంగా తెలుస్తోందని మంత్రి తెలిపారు. ఇది కేవలం పుకారుగానే తాను భావిస్తున్నానని..ఒకవేళ భారత్ పేరును ఎవరైనా వ్యతిరేకించారంటే అది వారి వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు.
Also read: G20 Summit: జీ20 అంటే ఏమిటి, జీ20 సమ్మిట్ ఎజెండా, ఉద్దేశ్యం, అవసరమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook