PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

కరోనా వైరస్ కష్టాల్లో చిక్కుకున్న రైతాంగానికి  మోదీ ప్రభుత్వం ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ప్రత్నిస్తోంది. 

Last Updated : Sep 23, 2020, 08:04 PM IST
    • కరోనా వైరస్ కష్టాల్లో చిక్కుకున్న రైతాంగానికి మోదీ ప్రభుత్వం ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ప్రత్నిస్తోంది.
    • ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనా ప్రకారం... రైతులకు రూ.2,000 చెల్లించనున్నారు.
    • కేంద్ర ప్రభుత్వ డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ ప్రక్రియలో రైతులకు డబ్బు బదిలీ చేయనున్నారు.
PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

కరోనా వైరస్ ( Coronavirus ) కష్టాల్లో చిక్కుకున్న రైతాంగానికి  మోదీ ప్రభుత్వం ( Modi Govt ) ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ప్రత్నిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనా ( Pradhan Mantri Kisan Samman Nidhi Yojana ) ప్రకారం... రైతులకు రూ.2,000 చెల్లించనున్నారు. కేంద్ర ప్రభుత్వ డైరక్ట్  బెనిఫిట్ ట్రాన్ఫర్ ( DBT ) ప్రక్రియలో రైతులకు డబ్బు బదిలీ చేయనున్నారు. మీరు కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు.
ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

14.4 కోట్ల మంది రైతులకు ప్రయోజనం..
ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ లో భాగంగా రైతుల ( Farmers ) ఖాతాలకు 2 వేల రూపాయలు బదిలీ చేయనున్నారు. గత నెలన్నర కాలంలోనే సుమారు 8.8 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ.2 వేల చొప్పన డబ్బును బదిలీ చేశారు. ఈ నిధులను డైరక్ట్ ప్రాఫిట్ ట్రాన్ఫర్ విధానంలో పంపించారు. ప్రభుత్వం 14.5 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్  ( Kisan Samman ) నగదును అందించేందుకు సిద్ధం అయింది. అయితే ఇందులో అందరికీ వెరిఫికేషన్ పూర్తి అవలేదు. ఈ పథకంలో మీరు చేరాలి అనుకుంటే మీరు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దాని కోసం మీరు ఈ నియమాలను గుర్తుంచుకోవాలి.

ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట

అప్లై చేయడం ఎలా..
మీ ఇంట్లో కూర్చొనే ఆన్ లైన్ లో ఈ పథకానికి అప్లై చేయవచ్చు. మీ దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవాలి అనుకున్నా.. లేదా మార్పులు చేయాలి అనుకున్నా వెంటనే మీరు పూర్తి చేయవచ్చు. దీనికోసం ముందు మీరు www.pmkisan.gov.in అనే వెబ్ సైట్ ను విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్ సైట్ మొదటి పేజీలోనే ఫార్మర్స్ కార్నర్ అని క్యాపిటల్ లెటర్స్ లో రాసి ఉంటుంది. ఇందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం బెసిఫీషరీ లిస్ట్ లో మీ పేరును చెక్ చేసుకోవచ్చు. దీని తరువాత మీ పేరును చెక్ చేయడానికి రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, ఊరు పేరు వంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

డబ్బు రాకుంటే ఇలా చేయండి...
మీరు ఇప్పటికే ఈ పథకానికి అప్లై చేస్తే బెనిఫీషరీ జాబితాలో మీ పేరును చెక్ చేయండి. దీని తరువాత మీ ఆధార్ కార్డు (Aadhaar ), బ్యాంకు వివరాలు లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదంటే 011-24300606 నెంబర్ కు కాల్ చేసి మీ పీఎం కిసాన్ పథకం స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. మీ డబ్బు ఎందుకు మీ ఖాతాలో పడలేదో వివరాలు తెలుసుకోవచ్చు.

ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News