Sunita Williams: గణపతి ప్రతిమను తీసుకెళ్తా.. మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌..

Sunita Williams: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్ష యాత్రకు వెళ్తున్నారు. ప్రస్తుతం తాను ఎలాంటి గందరగోళానికి గురికావట్లేదని కానీ, గణేషుడి ప్రతిమను తనతోపాటు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. బుచ్‌ విల్మోర్‌తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.   

Written by - Inamdar Paresh | Last Updated : May 6, 2024, 12:51 PM IST
  • భారత్ కు గర్వకారణం..
  • మరోసారి అంతరిక్ష యాత్ర సిద్ధయమైన సునీతా విలియమ్స్..
Sunita Williams: గణపతి ప్రతిమను తీసుకెళ్తా.. మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌..

Indian origin astronaut sunita williams set to fly space again: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్షంలోనికి వెళ్లనున్నారు. సునీతతోపాటు, మరో ఇద్దరు వ్యోమగాములు బోయింగ్‌ స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్‌లో ఈ నెల 7న స్పేస్‌లోకి వెళ్లనున్నారు. గతంలో బోయింగ్‌  మానవ రహిత ప్రయోగాలు చేపట్టింది. కానీ ప్రస్తుతం మొదటి సారిగా  మానవ సహిత యాత్ర చేపడుతున్నది. మే 7, 2024న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.04 గంటలకు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి సరికొత్త అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్‌లైనర్‌లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించడం గురించి ఎలాంటి కంగారు లేదని సునీతా పేర్కొన్నారు. లాంచ్ ప్యాడ్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు, తమకు అన్నిరకాల వాతావరణ పరిస్థితులలో ఉండేలా ట్రైన్ చేశారని సునీతా విలియన్స్ చెప్పారు. అంతేకాకుండా..  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నప్పుడు, తన ఇంటికి తిరిగి వెళ్లినట్లుగా ఉంటుందని అన్నారు. అంతరిక్షంలో సమోసాలు తినడానికి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మూడోసారి వెళ్లడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందన్నారు. 

Read More: Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?

డాక్టర్ దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా దంపతులకు వ్యోమగామి సునీతా విలియమ్స్ (59) జన్మించారు. ఆమె మానవ సహిత అంతరిక్ష నౌక యొక్క తొలి మిషన్‌లో ప్రయాణించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఒక క్వాలిఫైడ్ నేవీ టెస్ట్ పైలట్ గా ఖ్యాతి గడించారు. ఆమె 2006,  2012లో రెండుసార్లు అంతరిక్షయాత్ర చేపట్టారు.  NASA నుండి వచ్చిన సమాచారం ప్రకారం, సునీత మొత్తం 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. స్పెస్ లో ఎక్కువగా కాలం గడిపిన వ్యోమగామిగా కూడా రికార్డుల కెక్కారు. 

ఒక సమయంలో, ఆమె 50 గంటల 40 నిమిషాలు స్పేస్‌వాక్ చేసిన రికార్డును క్రియేట్ చేశారు. అయితే ఆ తర్వాత 10 స్పేస్‌వాక్‌లతో పెగ్గీ విట్సన్ దానిని అధిగమించిందని NASA తెలిపింది. సునీతా విలియమ్స్ తండ్రి న్యూరోఅనాటమిస్ట్. ఆయన గుజరాత్ లోని జులాసన్‌లో జన్మించారు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, ఆ తర్వాత USAకి వలస వెళ్లి స్లోవేనియన్‌కు చెందిన బోనీ పాండ్యాను వివాహం చేసుకున్నారు. బోయింగ్ యొక్క స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్‌కు పైలట్‌గా ఉండటానికి సునీతా ప్రస్తుతం సిద్ధమవుతున్నట్లు NASA తెలిపింది. సునీతా  విలియమ్స్.. 1998లో తొలిసారి వ్యోమగామిగా ఎంపికైంది. 2015లో స్పేస్ షటిల్ రిటైర్ అయిన తర్వాత, NASA యొక్క వాణిజ్య సిబ్బంది కార్యక్రమంలో ప్రయాణించే ఎంపిక చేసిన వ్యోమగాముల సమూహంలో భాగంగా ఆమె ఎంపిక చేయబడింది.

తన విమానాయానానకి ముందకు వ్యోమగామి సునీతా విలియమ్స్ మాట్లాడుతూ.. ఈసారి తనతో గణేషుడి విగ్రహాం తీసుకెళ్తున్నట్లు చెప్పారు. గతంలో రెండు సార్లు.. భగవద్గీత కాపీలను అంతరిక్షంలోకి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. వినాయకుడు నాతో ఉంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా, తన ప్రయాణం సక్సెస్ అవుతుందని ఆమె అన్నారు. తన ప్రయాణంలో అదృష్టం కూడా కలిసి వస్తుందని ఆమె అన్నారు. 

Read More: Station Master Dozes Off: గుర్రుపెట్టి పడుకున్న స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ కోసం లోకోపైలేట్ తంటాలు.. ఎక్కడో తెలుసా..?

అయితే.. భారతదేశం దాని స్వంత మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్‌యాన్‌ను కలిగి ఉంది. బోయింగ్ స్టార్‌లైనర్ క్రాఫ్ట్ యొక్క మొదటి విమానంలో మరొక మిషన్. ఇది మనందరికీ గర్వకారణమని బెంగళూరులోని ఇస్రో యొక్క మానవ అంతరిక్ష విమాన కేంద్రం అధిపతి డాక్టర్ ఎం మోహన్ అన్నారు. ఇది అంతరిక్షం ప్రయాణంలో మరో మైలురాయని, సునీతా టీమ్  ప్రయాణంలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సునీతా విలియమ్స్ ను  భారత ప్రభుత్వం 2008లో పద్మభూషణ్‌తో సత్కరించిన విషయం తెలసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News