ITBP Recruitment 2022: అర్హులైన, ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు గ్రూప్ సీ పరిధిలోకి వస్తాయి. ఐదంకెల వేతనం కలిగిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వేతనం, ముఖ్య తేదీలు తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ఖాళీలు :
హెడ్ కానిస్టేబుల్ (పురుషులు)-135
హెడ్ కానిస్టేబుల్ (స్త్రీలు)-158
హెడ్ కానిస్టేబుల్ (ఎల్‌డీసీఈ) - 90
వేతనం :
రూ.25,500-రూ.81,100 (7వ వేతన కమిషన్ ప్రకారం)
విద్యార్హతలు :
అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కంప్యూటర్‌పై ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేసే స్కిల్ ఉండాలి.
వయో పరిమితి :
హెడ్ కానిస్టేబుల్ (డైరెక్ట్ ఎంట్రీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు 18 నుంచి 25 ఏళ్ల లోపువారై ఉండాలి. అభ్యర్థులు 2/01/0/1997 కన్నా ముందు జన్మించి ఉండరాదు. హెడ్ కానిస్టేబుల్ (ఎల్‌డీసీఈ) పోస్టులకు 35 ఏళ్లు లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ముఖ్య తేదీలు :
జూన్ 8, 2022 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతంది. చివరి గడువు జూలై 7, 2022.
ఎలా అప్లై చేసుకోవాలి :
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో పంపించే దరఖాస్తులు స్వీకరించరు. www.recruitment.itbpolice.nic.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
Also Read: KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక జగన్?
Also Read: KTR ON BJP: బీజేపీ నేతలు సత్య హరిశ్చంద్రుడి బంధువులా? సీబీఐ, ఈడీ దాడులపై కేటీఆర్ సెటైర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి