JEE Advanced 2024: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ రెండు రకాల పరీక్షలుంటాయి. ఇందులో జేఈఈ మెయిన్స్ రెండు దశల్లో నిర్వహిస్తే అడ్వాన్స్డ్ ఒకే దశలో ఉంటుంది. మెయిన్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్ధులే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులు.
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్డ్ 2024 పరీక్ష రేపు మే 26న జరగనుంది. ఈ పరీక్షను నిర్వహిస్తున్న మద్రాస్ ఐఐటీ ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.in నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 31న విడుదల కానుంది. జూన్ 2వ తేదీన ప్రొవిజినల్ కీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. జూన్ 3 వరకూ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. ఫైనల్ కీ మాత్రం జూన్ 9న విడుదల కానుంది. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 1.91 లక్షలమంది రాస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్నించి 46 వేలమంది ఉన్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో రెండు పేపర్లుగా జరుగుతుంది. రెండు పేపర్లు తప్పకుండా రాయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మద్యాహ్నం 2.30 గంటల్నించి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్ 2 జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలకు అనుమతించరు. అందుకే కనీసం 20 నిమిషాలముందు పరీక్ష కేంద్రం వద్ద ఉండేట్టు చూసుకోండి.
Also read: Cyclone Remal: రేపు రాత్రి తీరం దాటనున్న రెమాల్ తుపాను, ఏపీలో మూడ్రోజులు వర్షసూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook