న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్స్ 2019 స్కోర్ కార్డుపైనే జేఈఈ అడ్వాన్స్డ్ 2019 కటాఫ్ మార్కులు సైతం అందుబాటులో ఉండనున్నాయి. ప్రతీఏడాది కేవలం ఒక్కసారే మెయిన్స్ పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షా మండలి (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఈసారి అందుకు భిన్నంగా రెండుసార్లు మెయిన్స్ నిర్వహించింది.
రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. jeemain.nic.in
గతేడాది డిసెంబరులో తొలి విడత మెయిన్స్ పరీక్షల పదిన్నర లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా ఈనెల 7 నుంచి 12వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరిగిన 2వ విడత పరీక్షకు దాదాపు 9,35,741 లక్షల మంది హాజరయ్యారు. ఇదిలావుంటే, 6.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే రెండు విడతల పరీక్షకు హాజరయ్యారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఎన్.టి.ఏ ఈ ఫలితాలను వెల్లడించింది.