భారతదేశంలో ఉగ్రవాదులు ప్రవేశించారని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. బీజేపీ అగ్రనేతలు, ప్రముఖ ముఖ్యమంత్రులే టార్గెట్ అని తెలిపింది. ఈ ఆపరేషన్ కు జైషే మహ్మద్, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థలు కుట్రపన్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. ఈ కుట్ర వెనుక జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఉన్నాడని చెప్పింది. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు భారతదేశంలో ప్రవేశించారని.. తక్కువ భద్రతతో తిరుగే ఓ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినట్లు సమాచారం అందిందని వెల్లడించాయి. మసూద్ అజహర్ మేనల్లుడు తహ్లా రషీద్ కాల్చివేతకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ కు కుట్ర పన్నారని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల చొరబడ్డారనే సమాచారం అందుకున్న భారత ఇంటలిజెన్స్ వర్గాలు బంగ్లా అధికారుల సహాయంతో ఢాకాలోని ఓ అనుమానిత ప్రదేశంలో రైడ్ చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు.