Farm Bills 2020: భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై నిరసనగా వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్, హరియాణ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు రాజధాని సరిహద్దుల వద్ద క్యాంపులు వేసుకుని మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు
తాజాగా కేరళకు (Kerala) చెందిన రైతులు కొంత మంది కలిసి ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు బహుమతి పంపించారు. రైతులు ఆరోగ్యంగా ఉండటానికి ఫైనాపిల్ పళ్లను పంపించారు. 16 టన్నుల పైనాపిల్‌ను రైతులకు పంపించారు కేరళ రైతులు. వీటిని ఢిల్లీలోని రైతులకు ఉచితంగా పంపిణి చేయాలి అని నిర్ణయించారు. ఈ పండ్లను కొనుగోలు చేయడానికి అవసరం అయిన నిధులను పైనాపిల్ ఫార్మర్స్ అసోసియేషన్ భరిస్తోంది. ఈ సంస్థ నేత అయిన జేమ్స్ తొట్టుమురియాల్ మాట్లాడుతూ పైనాపిల్ సిటీగా పాపులర్ అయి వలాకులం నుంచి పండ్లను పంపించారు అని తెలిసింది.
Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!
కేరళ నుంచి ఇప్పటికే ఈ పండ్ల లారీలు ఢిల్లీవైపు పయనం అయ్యాయి అని సమాచారం. ఇవి త్వరలోనే ఢిల్లీలోని (Delhi) గురుద్వారకు చేరుకోనున్నాయి.భారతదేశంలో ఈ స్థాయిలో రైతులు నిరసన వ్యక్తం చేయడం అనేది మొదటి సారి..వారికి మద్దతుగా సానుభూతిగా, వారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు జేమ్స్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe