కొచ్చి : కరోనా వైరస్ను (Coronavirus) అరికట్టే ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన లాక్డౌన్ (During lockdown) సమయంలో కేంద్రం విధించిన ఆంక్షలను లెక్కచేయకుండా రోడ్లపైకి వస్తున్నారా ? ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ? అయితే ఇదిగో ఇది మీ కోసమే. దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కరోనా వైరస్ ప్రజలకు మరింత సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన నిబంధన కావడంతో.. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అతీతతంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్డౌన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లాక్డౌన్ సందర్భంగా రోడ్లపైకి వచ్చిన కేరళ ప్రజలపై కేరళ పోలీసులు సైతం అంతే కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. బుధవారం ఒక్క రోజే 2,535 మందిని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు.. వారి నుంచి 1,636 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Read also : COVID-19: కేంద్రం వైపు నుంచి మరో కీలక నిర్ణయం
అరెస్ట్ అయిన వారిపై, వాహనదారులపై లాక్డౌన్ ఉల్లంఘన నేరం కింద అరెస్ట్ చేసినట్టు కేరళ పోలీసులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..