Jammu Kashmir Haryana Assembly Elections Results 2024 Live: హర్యానా, జమ్మూ కశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. హర్యానాలోని మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించగా.. 68 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 93 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 90 స్థానాలకు 63.88 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 28 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. హర్యానాలో హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్నేయగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక జమ్మూ కశ్మీర్‌లో పదేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. బీజేపీ, పీడీపీ సొంతంగా పోటీ చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన నేపథ్యంలో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.