LPG cylinder price Rs 633: కేవలం 633 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. పూర్తి వివరాలు

LPG Cylinder offer: గ్యాస్ సిలిండర్ల ధరలు భగ్గుమంటోన్న నేపథ్యంలో వినియోగదారులకు ఒక గుడ్‌ న్యూస్ చెప్పింది ఇండేన్ గ్యాస్. 633 రూపాయలకే కొత్త సిలిండర్ అందిస్తోంది. మరి ఆ డిటేల్స్‌ ఏంటో ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 11:07 AM IST
  • కొత్త గ్యాస్ సిలిండర్‌ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త
  • చాలా తక్కువ ధరకే ఎల్పీజీ సిలిండర్‌
  • కేవలం రూ. 633కే గ్యాస్ సిలిండర్‌‌ను పొందే అవకాశం
LPG cylinder price Rs 633: కేవలం 633 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. పూర్తి వివరాలు

New Composite Cylinder: మీరు కొత్త గ్యాస్ సిలిండర్‌ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే మీకోసమే ఈ వార్త. ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్‌ను (LPG Cylinder) మీరు చాలా తక్కువ ధరకే పొందొచ్చు. కేవలం రూ. 633కే మీరు గ్యాస్ సిలిండర్‌‌ను (Gas Cylinder‌‌) పొందే అవకాశం ఉంది.ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల ధరలు కాస్త ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇండేన్ గ్యాస్ (Indane Gas) కంపెనీ కేవలం రూ.633కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఈ సిలిండర్‌ను చాలా సులభంగా పొందవచ్చు.

ఇండేన్‌ గ్యాస్ కంపెనీ కస్టమర్ల సౌలభ్యం కోసం కాంపోజిట్ సిలిండర్‌ (Composite Cylinder) సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇక ఈ సిలిండర్‌ను మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చాలా సులభంగా బదిలీ చేసుకునే వెసులుబాటును కూడా ఇండేన్ కల్పించింది. చిన్న కుంటుంబానికి అయితే ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

ఈ కాంపోజిట్ సిలిండర్ల బరువు కూడా తక్కువగా ఉంటుంది. కాంపోజిట్ సిలిండర్లలో 10 కిలోల గ్యాస్ (Gas) వస్తుంది. అందువల్ల దీని ధర కూడా తక్కువగా నిర్ణయించారు. అయితే ఇది మాములు సిలిండర్ మాదిరిగా ఉండదు. ఈ సిలిండర్‌‌పై ప్లాస్టిక్ తొడుగు కూడా ఉంటుంది. దీని వల్ల కాంపోజిట్ సిలిండర్‌‌ ఇతర వాటిలాగా తుప్పు పట్టకుండా ఉంటుంది.

ప్రస్తుతం కాంపోజిట్ సిలిండర్లు దేశంలో 28 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో దేశంలోని అన్ని నగరాల్లోకి కాంపోజిట్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ సిలిండర్ ధర ముంబైలో రూ.634 ఉండగా.. కోల్‌కతాలో రూ.652, చెన్నైలో రూ.645, లక్నోలో రూ.660, ఇండోర్‌లో రూ.653, భోపాల్‌లో రూ.638, గోరఖ్‌పూర్‌లో రూ.677గా ఉంది.

ఇక జనవరి నెలలో కూడా 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఢిల్లీలో (Delhi) 14.2 కిలోల నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.899.50 ఉండగా.. కోల్‌కతాలో రూ.926, ముంబైలో రూ.899.50, చెన్నైలో రూ.915.50గా ఉంది. కమర్షియల్ సిలిండర్‌‌ (Cylinder) విషయానికి వస్తే.. ఢిల్లీలో రూ 1998.50, కోల్‌కతాలో రూ. 2076, ముంబైలో రూ 1948.50, చెన్నైలో (Chennai) రూ. 2131గా ఉంది.

Also Read: AP Temperatures: రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, భారీగా పొగమంచు

Also Read: India corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- తాజాగా ఎన్నికేసులంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News