టీచర్‌ను నరికి తల పట్టుకొని పరారైన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి ఉపాధ్యాయురాలి తలను నరికాడు.
వివరాల్లోకి వెళ్తే.. సుక్రా హెసా(30) అనే మహిళ సెరాయికెల-ఖర్షావన్ జిల్లాలోని కప్రాసాయి గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. స్కూల్ లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతుండగా.. హరి హెమ్‌బ్రామ్ అనే 26 ఏళ్ల మతిస్థిమితం లేని వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి. సుక్రా హెసాను బయటకి ఈడ్చుకొచ్చి.. ఆమెపై పదునైన కత్తితో దాడి చేసి తల నరికాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే.. అప్పటికే స్థానికులు నిందితుడిపై రాళ్ల దాడికి దిగడంతో.. టీచర్ తల పట్టుకుని అడవిలోకి పారిపోయాడు.
దాదాపు రెండు గంటల తరువాత 5 కి.మీల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితునికి మతిస్థిమితం సరిగాలేదని.. పాఠశాలకు సమీపంలోనే ఒంటరిగా ఉంటాడని స్థానికులు చెప్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియలేదు.