Varanasi: కాశీలో ప్రసాదంగా 'మిల్లెట్‌ లడ్డూలు'.. 'శ్రీ అన్న ప్రసాదం'గా పేరు మార్పు!

Kashi Vishwanath temple: కాశీ విశ్వనాథుడి ఆలయంలో తృణధాన్యాలతో చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. మిల్లెట్స్ ప్రోత్సాహక చర్యల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 08:35 AM IST
Varanasi: కాశీలో ప్రసాదంగా 'మిల్లెట్‌ లడ్డూలు'.. 'శ్రీ అన్న ప్రసాదం'గా పేరు మార్పు!

Kashi Vishwanath Dham: ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గమైనా వారణాసిలో గల కాశీ విశ్వనాథ దేవాలయంలో మిల్లెట్‌లతో చేసిన లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఇకపై దీనిని 'శ్రీ అన్న ప్రసాదం'గా పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లడ్డూలను మినుములు, నువ్వులు, బెల్లం, దేశీ నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేయనున్నారు. వీటి తయారీ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. 

'దేశీ నెయ్యిలో మినుములు, నువ్వులు, బెల్లం కలిపి లడ్డూలు తయారు చేస్తున్నాం. సంపూర్ణ స్వచ్ఛతను నిర్ధారిస్తాం. “ఇంతకుముందు ప్రసాదాన్ని పిండి, సెమోలినా, జీడిపప్పు మరియు బాదంతో తయారు చేయబడేది. ఇప్పుడు సిద్దం చేసే లడ్డూలపై "ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023" లోగో కూడా ఉంటుంది.  ఆలయ ప్రాంగణంలో కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం'.. అని మహిళా సంఘం అధ్యక్షురాలు సునీతా జైస్వాల్  తెలిపారు.

100 గ్రాములు మరియు 200 గ్రాముల ప్యాక్‌లలో లభించే ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలనే దానిపై బృందానికి శిక్షణ కూడా ఇచ్చారు. లడ్డోల తయారీ, నాణ్యత మరియు ప్యాకింగ్‌ను వారణాసి చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్ పరీక్షించారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎప్పటి నుంచో మిల్లెట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా జొన్న, బజ్రా మరియు మొక్కజొన్న వంటి ముతక తృణధాన్యాలను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు చేపడతున్నారు. 

Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News